విరాట్ కోహ్లితో పోల్చుతూ పాకిస్తాన్ రిపోర్టర్ సెటైర్లు.. కోపంగా రిప్లై ఇచ్చిన బాబర్ ఆజామ్

Wait 5 sec.

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మరోసారి సహనం కోల్పోయాడు. ఫామ్ కోల్పోయిన తర్వాత బాబర్ ఆజామ్ సొంత దేశ అభిమానులే సెటైర్లు వేశారు. అప్పట్లో జింబాబర్ అంటూ తెగ ట్రోల్ చేశారు. ఆ సమయంలో కూడా సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న బాబర్‌కు చిర్రెత్తించింది. దాంతో కోపంగా రిప్లై ఇచ్చాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లికి పోటీగా ఆడిన బాబర్ ఆజామ్.. ఆ తర్వాత ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. కోహ్లి మధ్యలో ఫామ్ కోల్పోయినా.. మళ్లీ తిరిగి పుంజుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై మ్యాచ్ విన్నింగ్ నాక్స్‌తో దాయాదికి నిద్రలేకుండా చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్తాన్‌కు కాళరాత్రిని మిగిల్చాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా పెషావర్ జల్మీ తరఫున ఆడుతున్న బాబర్ ఆజామ్.. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై మ్యాచ్ అనంతరం వికేలకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఆ మ్యాచ్‌లో 37 బంతుల్లో 43 పరుగులు చేసిన బాబర్.. ఎక్కువ సేపు క్రీజులో నిలిచి మ్యాచ్ విన్నర్‌గా మారలేకపోయాడు. ఆఖరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో పెషావర్ జట్టు లాస్ట్ బాల్‌కి విక్టరీ సాధించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ "కోహ్లి మీలాగే ఆడతాడు. కానీ మ్యాచ్‌లను ఫినిష్ చేస్తాడు. కానీ మీరెందుకు చేయాలేక పోతున్నారు?" అని బాబర్‌ని అడిగాడు. దాంతో చిర్రెత్తిపోయిన బాబర్ అసహనంగా రిప్లై ఇచ్చాడు. "ఇకనైనా ఇలాంటి పోలికలు ఆపండి. అలాంటి పోలికలు మీదగ్గరే ఉంచుకోండి. నేను మ్యాచ్‌లు ఫినిష్ చేయలేదనేది మీ అపోహ మాత్రమే" అంటూ సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్ జట్టులో అత్యుత్తమ బ్యాటర్లలో బాబర్ ఆజామ్ ఒకడు. అయినప్పటికీ టీ20 ఫార్మాట్‌లో బాబర్ తరచూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం బాబర్ స్ట్రయిక్ రేటే అని చెప్పొచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి 126.15 స్ట్రయిక్ రేట్‌తో 82 పరుగులు చేశాడు.