ట్రంప్ డెడ్‌లైన్ దెబ్బకు.. మళ్లీ నష్టాల్లోకి దేశీయ మార్కెట్లు.. కీలక రంగాల్లో అమ్మకాలు

Wait 5 sec.

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపించాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం రోజు మార్కెట్ పరిస్థితులు తెలుసుకుందాం. ఈరోజు ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 73,734 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. క్రితం రోజు ముగింపుతో పోలిస్తే 170 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 73,282 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్ల నష్టంతో 73,902 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఈరోజు 22,838 పాయింట్ల వద్ద నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఈ వార్త రాసే సమయానికి 60పాయింట్ల నష్టంతో 22,907 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, విప్రో, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అదే ఇండిగో, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎటర్నల్, ఐషన్ మోటార్స్ వంటి కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రంప్ డెడ్‌లైన్ ఎఫెక్ట్హార్ముజ్ జల సంధిని పూర్తింగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కొత్త డెడ్‌లైన్ విధించారు. ఈ గడువుకు ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. దీంతో పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందోన్న ఆందోళనలు నెలకొన్నాయి. సంచలనంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లు దాటేసింది. అలాగే ఆసియా దేశాలకు సౌదీ అరేబియా చమురు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్లు కీలక రంగాల్లో అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.