ఇరాన్ సంఘర్షణ ప్రపంచ యుద్దమే.. చైనా, రష్యాలే విజేతలు: ప్రముఖ బిలియనీర్

Wait 5 sec.

పశ్చిమాసియాలో సంఘర్షణను ముగించేందుకు కుదిరింది. దీంతో ప్రపంచం కాస్త ఊపిరిపీల్చుకుంది. కానీ, ఈ యుద్ధాన్ని కేవలం ఓ ప్రాంతీయ సంక్షోభంగా లేదా ముగింపుదశకు చేరుకున్నట్టు భావించడం అవివేకమవుతుందని ప్రముఖ హెచ్చరికలు చేశారు. ఇది ప్రపంచ వ్యవస్థలో సంభవిస్తున్న భారీ విచ్ఛిన్నంలో ఒక భాగమని ఇన్వెస్టర్ హెచ్చరించారు. గతంలో ప్రపంచ యుద్ధాలకు ముందు జరిగిన లాంటి చారిత్రక పరిణామాలు ప్రస్తుతం కూడా కనిపిస్తున్నాయని ఆయన విశ్లేషించారు.‘‘మనం ప్రపంచ యుద్ధంలో ఉన్నాం.. ఇది త్వరగా ముగియదు’’ అని ఇన్వెస్టర్ డాలియో తన బ్లాగులో రాసుకొచ్చారు. ఇరాన్ యుద్ధాన్ని కేవలం ఓ ప్రాంతీయ సంఘర్షణగా కాకుండా.. సైనిక, ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక రాజకీయాల్లో అంతర్లీనంగా విస్తరించిన ఘర్షణగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే మూడో మొదలైందని డాలియో అనడం గమనార్హం. వినడానికి ఇది అతిశయోక్తిగా అనిపించినా.. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్- అమెరికా- ఐరోపా యుద్ధం, ఇజ్రాయెల్-గాజా-లెబనాన్-సిరియా యుద్ధం, యెమెన్- సుడాన్- సౌదీ అరేబియా- యూఏఈ యుద్ధం, వేర్వేరు కాదని అన్నారు. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉందని తెలిపారు.గత రెండు ప్రపంచ యుద్ధాల మాదిరిగానే ఇవన్నీ కలిసి మరో ప్రపంచ యుద్ధంగా మారుతున్నాయని బిలియనీర్ వివరించారు. చరిత్ర ఎప్పుడూ ఒకే తరహాలో పునరావృతమవుతుందనేది డాలియో వాదన. ఆర్థిక వ్యవస్థలు, దేశీయ రాజకీయాలు, అంతర్జాతీయ భౌగోళిక క్రమం ఏకకాలంలో బలహీనపడినప్పుడు ఈ చక్రంలో మార్పు వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిణామాలను మొదటి ప్రపంచ యుద్ధం (1913-1914), రెండో ప్రపంచ యుద్ధం (1938-39) ముందున్న పరిస్థితులతో ఆయన పోల్చారు. ఈ దశను ఆయన యుద్ధానికి ముందు దశ నుంచి సంఘర్షనకు మారే దశగా అభిప్రాయపడ్డారు. కచ్చితమైన సమయం కాదని డాలియో చెప్పినప్పటికీ, ఆయన విస్తృత సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. బిలియనీర్ ప్రకారం.. సాధారణంగా పెద్ద యుద్ధాలకు ముందు ఉండే పరిస్థితులు ఇప్పటికే ఏర్పడ్డాయి. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల శక్తుల ముందు ఆధిపత్య శక్తులు బలహీనపడతాయి. ఆ తర్వాత ఆంక్షలు, వాణిజ్య దిగ్బంధనాలతో ఆర్థిక యుద్ధం విస్తరిస్తుంది. కూటములు బలపడి, పరోక్ష యుద్ధాలు పెరుగుతాయి. ముఖ్యంగా తమ సామర్థ్యానికి మించి విస్తరించిన శక్తులలో ఆర్థిక ఒత్తిడి, రుణభారం, లోటు పెరుగుతాయి. కీలక పరిశ్రమలు, సరఫరా గొలుసులు మరింత కఠినమైన ప్రభుత్వ నియంత్రణలోకి వస్తాయి. వాణిజ్య అవరోధాలు ఆయుధాలుగా మారతాయి. కొత్త యుద్ధ సాంకేతికతలు నిర్మించబడతాయి. ఆ తర్వాత ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతాయని, ప్రపంచం ఇప్పటికే ఆ దశకు చేరుకుంది’’ అని డాలియో అన్నారు.ఈ యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటికే తేలిపోయిందని డాలియో వ్యాఖ్యానించారు. ‘అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుంటే, ఈ యుద్ధం వల్ల చైనా, రష్యాలే ఆర్థికంగా, భౌగోళిక రాజకీయంగా విజేతలుగా నిలిచినట్లు కనిపిస్తోంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏర్పడుతున్న కూటములు యుద్ధ రంగం కంటే భిన్నమైనవని ఆయన తెలిపారు. వారి ఒప్పందాలు, అధికారిక పొత్తులు, ఐక్యరాజ్యసమితిలో వారి బలం, నాయకుల ప్రకటనలు, చర్యలు వంటివి ఇరుపక్షాలు ఏ విధంగా ఏకమవుతున్నాయో తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.‘అమెరికా, దాని భాగస్వాములు ఓవైపు.. చైనా, రష్యా ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాల మరోవైపు’ అని అన్నారు. 1945 అనంతర ఏర్పడిన ప్రపంచ వ్యవస్థ క్షీణించి ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ప్రపంచ వ్యవస్థగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం కోసం అమెరికా తన ఆర్థిక, సైనిక వనరులను ఎంతగా ఖర్చుచేస్తోంది, మిత్రదేశాలను ఎంత వరకూ రక్షిస్తోందనే అంశాలే భవిష్యత్తు ప్రపంచ క్రమాన్ని నిర్దేశిస్తాయని డాలియో అన్నారు. ఈ దశలో ఘర్షణలు తగ్గడం కంటే తీవ్రతరం కావడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు.