తెలంగాణలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులపై వస్తోన్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో కలిసి ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌‌తో భేటీ అయ్యారు. అనంతరం కిషన్‌రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్మించాలని కేంద్రం భావిస్తోందని కీలక ప్రకటన చేశారు. ఆదిలాబాద్‌లో రక్షణ శాఖకు 300 ఎకరాల భూమి కూడా ఉందని వెల్లడించారు. సివిల్‌ ఏవియేషన్‌తో కలిసి జాయింట్ వెంచర్‌కు సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ తాజాగా చెప్పిందన్నారు. సైన్యానికి శిక్షణతోపాటు సివిల్ ఏవియేషన్‌ అవసరాల కోసం ఈ ఎయిర్‌పోర్టును వాడాలని రక్షణ శాఖ మంత్రి వెల్లడించినట్లు తెలిపారు. ఈ నెల 17న క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని ఏవియేషన్ అధికారులు నిర్ణయించారన్నారు. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. భూసేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆదిలాబాద్‌ జిల్లా నేతలు ఇప్పటికే తమకు స్పష్టం చేశారన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుకూలతలు ఆదిలాబాద్‌కు ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంపించిందని అక్కడే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుపైనా మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రానున్న 3 నెలల్లో ఈ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గతంలో అక్కడ ఎయిర్‌స్ట్రిప్ ఉండగా.. అదనపు భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పర్యటిస్తారని వెల్లడించారు.కాగా, ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రకటన చేశారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు విషయమై ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌, రామ్మోహన్‌నాయులతో సంప్రదింపులు చేశామన్నారు. జూన్ 2 తేదీలోపు పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టుతో పాటు ఇక్కడ అదిపెద్ద పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తామన్నారు. దాంతో స్థానిక యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్మోహన్ నాయుడు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.