RR vs MI మధ్య 11 ఓవర్ల మ్యాచ్.. రాజస్థాన్ - ముంబై టీమ్స్‌ను టెన్షన్ పెట్టిన వర్షం

Wait 5 sec.

వర్షం కారణంగా మధ్య మ్యాచ్ ఆల్యంగా ప్రారంభమైంది. వర్షం కారణంగా 7 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యంగా రాత్రి 9:55 గంటలకు వేశారు. ఇక గువాహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ టాస్ గెలిచాడు. దాంతో జట్టు తొలుత బ్యాటింగ్‌కి రానుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:10 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. గువాహటిలో వర్షం కారణంగా గ్రౌండ్ తడిసింది. దాంతో బాల్ స్కిడ్ అవడంతో పాటు, పేస్ కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఇరు జట్లు తమ తమ కీలక పేసర్లను బరిలోకి దించింది. డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. బౌలర్లతో పాటు ఫీల్డింగ్ చేసే వారికి కూడా కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ - ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటి వరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 16 సార్లు గెలిస్తే, రాజస్థాన్ రాయల్స్ 14 సార్లు విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 2021 నుంచి జరిగిన మ్యాచ్‌లలో ముంబై ఐదు గెలిస్తే, రాజస్థాన్ మూడు గెలిచింది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మీదే ఉంది. గత సీజన్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సూర్యవంశీ.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. గుజరాత్ మీద జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 35 పరుగులు చేశాడు. మరి, యువ తేజం వైభవ్‌ బౌండరీల ప్రవాహానికి ముంబై తరఫున ఆడుతున్న వరల్డ్ క్లాస్ బౌలర్లు ఎలా అడ్డుకట్ట వేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టువైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధృవ్ జురేల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), హెట్మెయర్, రవీంద్ర జడేజా, డొనోవాన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, బర్గర్, రవి బిష్ణోయ్. ముంబై ఇండియన్స్ జట్టురోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఏఎం ఘజన్‌ఫర్.