విజయవాడలో అధునాతన కన్వెన్షన్ సెంటర్.. ప్రారంభానికి సర్వం సిద్ధం..

Wait 5 sec.

విజయవాడలో మరో అధునాతన కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి రానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనంలో ()నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా ప్రాంగణం పేరుతో బీఆర్ అంబేద్కర్ స్మృతివనంలో దీనిని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌లో 1500 సీటింగ్ సామర్థ్యంతో మెయిన్ హాల్ ఉంది. అలాగే వీఐపీ లాంజ్, ఎగ్జిక్యూటివ్ సూట్స్, గ్రీన్ రూమ్స్, అధునాతన ఆడియో విజువల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైక్వాలిటీ ఇంటీరియర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. బీఆర్ సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. భారీ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వగలిగేలా.. మౌలిక సదుపాయాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు విజయవాడ ఆతిథ్యం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని ప్రారంభించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం రూ. 404 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనాన్ని అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ స్మతివనంలో Statue of Social Justice పేరుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసే కేంద్రం, ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.. కొత్త కన్వెన్షన్ సెంటర్ 13,479 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో 370 కార్లు, 250 ద్విచక్ర వాహనాలను నిలిపేందుకు సరిపడా పార్కింగ్ వసతి ఉంది. మరోవైపు 404 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులలో ఇప్పటి వరకూ రూ.320 కోట్ల విలువైన పనులు పూర్తైనట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ అందుబాటులోకి వస్తే.. వివిధ కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వటం ద్వారా అంబేద్కర్ స్మృతివనానికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మంగళవారం ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించనున్నారు.