ట్రంప్ ఆదేశాలతో అంతా మారిపోయింది.. ఒక్కరోజే 10 శాతం పెరిగిన క్రూడాయిల్ ధర.. ఇప్పుడు ఎంతంటే?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో యుద్దం ముగుస్తుందన్న సంకేతాలు అందాయి. రెండు దేశాలకు చర్చలు కూడా జరపనున్నట్లు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధిలో కార్యకలాపాలు యథావిధిగా తిరిగి ప్రారంభం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ కూడా దీనికి ముందుగా ఒప్పుకుంది. తమ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు ఉంటాయని తెలిపింది. దీంతో అప్పుడు భారత స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా పరిస్థితి తారుమారైపోయింది. . ఇదే సమయంలో మరోసారి పశ్చిమాసియా వేడెక్కింది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో యుద్ధం ముగింపుపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కనిష్ఠాల నుంచి మళ్లీ ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనలే ఇందుకు కారణం.కిందటి రోజు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 95.20 డాలర్లుగా ఉండగా.. ఇది ఇంట్రాడేలో 10 శాతం వరకు పెరిగి 103.86 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో కూడా క్రూడాయిల్ ధర 8 శాతం వరకు పెరిగి 102.66 డాలర్ల వద్ద ఉంది. క్రూడాయిల్ ధరలు పెరిగితే మరోసారి.. పలు దేశాల్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు క్రూడాయిల్ ధర దాదాపు 70 డాలర్ల దిగువ స్థాయిలో ఉండగా.. అక్కడి నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక దశలో మళ్లీ 120 డాలర్ల స్థాయికి ఎగబాకింది. తర్వాత రెండు దేశాల ప్రకటనల నేపథ్యంలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరిగిన క్రమంలో.. మళ్లీ . సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా పడిపోగా.. నిఫ్టీ 220 పాయింట్లు పతనమైంది. క్రూడాయిల్ ధరలు పెరిగిన క్రమంలో.. మళ్లీ బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.