మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో కోర్టు తీర్పు

Wait 5 sec.

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష పడింది. ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. 2016 ఏప్రిల్‌లో విశాఖపట్నంలో రైల్వే జోన్‌ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అమర్ ఆరోగ్యం క్షీణించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటి టూటౌన్‌ పోలీసులు అమర్‌నాథ్‌పై పోలీసులు ఆత్మహత్యాయత్నం నేరం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసులో అమర్‌పై నేరం రుజువు కావడంతో రైల్వే కోర్టు అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వరలక్ష్మి తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పుపై గుడివాడ అమర్‌నాథ్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.గుడివాడ అమర్‌నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన 2006లో విశాఖపట్నంలో కార్పొరేటర్‌గా గెలిచారు. అమర్ 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీల చేరారు. ఆయన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా పనిచేశారు. గుడివాడ అమర్‌నాథ్‌ 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో అమర్ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆయనకు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అమర్‌నాథ్ గాజువాక నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు.గుడివాడ అమర్‌నాథ్ తండ్రి గుడివాడ గురునాథ రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. గుడివాడ గురునాథరావు తన తండ్రి గుడివాడ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చారు. గుడివాడ గురునాథరావు 1985లో ఎన్నికల్లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 1989లో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు.. ఆయనరాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గురునాథరావు 1998 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎంపీగా గెలిచారు. ఆయన 1999లో మరోసారి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.