శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. భక్తుల ఇబ్బందులు..

Wait 5 sec.

ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్ల బుకింగ్ విషయంలో అంతరాయం కలుగుతోంది. ఫలితంగా బుక్ చేసిన టికెట్లు డౌన్ లోడ్ కాకపోవటంతో మల్లన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ హిస్టరీలో టికెట్లు కనిపించకపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వెబ్‌సైట్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వారాంతం కావటంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది నేరుగా దర్శనానికి వస్తుంటే.. మరికొందరు ఆన్ లైన్ ద్వారా శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం కోసం టికెట్లు బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వెబ్‌సైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా... ఇలాంటి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీశైలం మల్లిఖార్జునస్వామి, భ్రమరాంబికా దేవి కొలువై ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా కర్నాటక నుంచి శైవభక్తులు కాలినడకన శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని పాతాళగంగలో స్నానాలు ఆచరించి. భక్తి శ్రద్ధలతో మల్లన్నను దర్శించుకుంటూ ఉంటారు.అలాగే కార్తీక మాసంలోనూ శ్రీశైలం దేవాలయం కొత్త శోభను సంతరించుకుంటుంది. భక్తుల శివ నామస్మరణ, కార్తీక దీపకాంతులతో ఆలయం కాంతులీనుతూ ఉంటుంది. సాధారణ భక్తులతో పాటుగా శివ దీక్షాపరులు మల్లన్న దర్శనం కోసం తరలివస్తుంటారు. ఇక భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం, సెలవుల సీజన్ కావటంతో భక్తుల తాకిడికి అనుగుణంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.