అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైతే ఏం జరుగుతుంది? ట్రంప్ వద్ద ప్లాన్ బి సిద్ధంగా ఉందా?

Wait 5 sec.

పశ్చిమాసియాలో సంఘర్షణకు ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ, విఫలమైతే తమ వద్ద ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైనా లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ నిరాకరిస్తే అమెరికా వద్ద 'ప్లాన్ బి' సిద్ధంగా ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.‘‘మాకు ఎటువంటి బ్యాకప్ ప్లాన్ అవసరం లేదు. ఇరాన్ సైన్యం నాశనమైంది.. మేము ప్రతిదీ ధ్వంసం చేశాం.. వాళ్ల దగ్గర క్షిపణులు చాలా తక్కువ ఉన్నాయి. వాటి తయారీ సామర్థ్యం కూడా క్షీణించింది. మేము వారిని చాలా గట్టిగా దెబ్బతీశాం. మా సైన్యం అద్భుతమైన పని తీరు కనబరిచింది’’ అని మీడియాతో అన్నారు.దాదాపు ఐదు వారాల కొనసాగిన యుద్ధం ఇరాన్, అమెరికాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణతో గల్ఫ్ ప్రాంతంలో స్వల్ప ప్రశాంతత నెలకుంది. అయితే, ఇదే సమయంలో అమెరికా అదనపు దళాలను పశ్చిమాసియాకు పంపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. వైట్‌హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో ఈ చర్చలు స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ప్రారంభమవుతాయి. ఇ ఇస్లామాబాద్ చేరుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. వారికి పాక్ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఘనస్వాగతం పలికారు.అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. పాక్ బయలుదేరే ముందు ఆయన ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. ‘మాతో ఆటలు ఆడాలని చూస్తే, ఈ చర్చల బృందం అంత సులభంగా అంగీకరించదని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.చర్చల్లో ప్రధానాంశాలుఅమెరికా చేసిన ప్రతిపాదనల్లో ఇరాన్ శుద్దిచేసిన యూరేనియంను అప్పగించాలని, బాలిస్టిక్ క్షిపణుల తయారీ నిలిపివేయాలని కోరింది. దీనికి ప్రతిగా ఇరాన్ 10 అంశాల ప్రణాళికలో హర్మూజ్ జల సంధిపై పూర్తి అధికారం, యుద్ధానికి నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కూడా వచ్చే వారం చర్చలు జరగనున్నాయి.