: గత కొంత కాలంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్న సంగతి తెలిసిందే. తీవ్ర ఒడుదొడుకులు ఉన్నాయి. దీంతో ఇక్కడ మంచి లాభాల్ని అందుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు ఆలోచిస్తున్నారు. ఇక్కడ సేఫ్ రిటర్న్స్ అందించే వాటిల్లో చాలా మందికి ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు కనిపించే ఆప్షన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. . ఇంకా టెన్యూర్‌ను బట్టి కూడా వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులు స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లు తీసుకొచ్చాయి. అయితే చాలా వరకు ఒక టెన్యూర్‌కు డిపాజిట్ తీసుకుంటే.. అది ముగిసేలోపు మనకు డబ్బులు రావు. ముందుగా కావాలంటే పెనాల్టీ పడుతుంది. వడ్డీ రేటులో కోత పడుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో.. మార్కెట్ బాగాలేనప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా మంచి రాబడి వచ్చేలా.. ఇంకా మన అవసరాలకు తగ్గట్లుగా ఉపయోగించుకునేందుకు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ స్ట్రాటజీని పాటించడం వల్ల మంచి రాబడులు పొందొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఎఫ్‌డీ అంటే మనం పెట్టుబడి మొత్తాన్ని ఒకే టెన్యూర్‌కు డిపాజిట్ చేస్తుంటాం. కానీ ఎఫ్‌డీ లాడరింగ్ టెక్నిక్ విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి.. ఒకే కాల పరిమితికి ఇన్వెస్ట్ చేయకుండా.. వైవిధ్యంగా ఉంచేలా చేస్తుంది. అంటే ఉదాహరణకు .. ఇంకొత్త మొత్తాన్ని మరో టెన్యూర్‌కు ఇలా విభజించుకోవచ్చు. ఇక్కడ 5 లక్షలు ఉన్నప్పుడు.. రూ .1 లక్షను ఏడాది టెన్యూర్‌పై.. మరో రూ. 1 లక్షను రెండేళ్ల టెన్యూర్‌పై.. ఇంకో లక్షను ఐదేళ్ల కాల పరిమితికి ఇలా విభజించి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎఫ్‌డీ లాడరింగ్ బెనిఫిట్స్..ఈ ఎఫ్‌డీ లాడర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చేతిలో డబ్బు ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మళ్లీ ఎక్కువ వడ్డీ బ్యాంకుల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ముందుగా 5 లక్షల్ని లక్ష చొప్పున వేర్వేరు టెన్యూర్లకు (1, 2, 3, 4, 5 ఏళ్లకు ఇలా) డిపాజిట్ చేశామనుకుందాం. అప్పుడు రూ. 1 లక్షను ఏడాది కాలానికి ఎఫ్‌డీ చేస్తే.. ఏడాది తర్వాత మీకు వడ్డీతో కలిపి చేతికి వస్తుంది. అప్పుడు మీ అవసరాలు ఉంటే దానిని వాడుకోవచ్చు లేకపోతే మరో టెన్యూర్‌కు అదే బ్యాంకులో లేదా మరో బ్యాంకులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరో ఏడాదికి ఇంకోటి మెచ్యూర్ అవుతుంది. ఇలా మీకు అవసరమైనప్పుడు వేర్వేరు టెన్యూర్లకు అనుగుణంగా డబ్బులు తీసుకోవచ్చు. అవసరం లేకుంటే మరో బ్యాంకులో లేదా అధిక వడ్డీ ఇచ్చే మరో టెన్యూర్‌పై మీ అవసరాలకు తగ్గట్లుగా.. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.