ట్రంప్ ఒక్క ప్రకటనతో కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు.. ఒక్కరోజే 20 శాతం డౌన్.. మంచి రోజులొచ్చాయా?

Wait 5 sec.

Crude Oil Price Crash: ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంతో కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చమురు, గ్యాస్ రవాణాకు కీలకంగా ఉన్నటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో సీన్ మారిపోయింది. గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా కుప్పకూలాయి. కిందటి రోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఏప్రిల్ 7 రాత్రి నుంచి ఏప్రిల్ 8 ఉదయం వరకు ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం వరకు తగ్గి ఒక దశలో 90.01 డాలర్ల స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 7.30 గంటలకు కూడా దాదాపు 18 శాతం పతనంతో 94 డాలర్ల స్థాయిలో ఉంది. యుద్ధానికి ముందు.. . ఇక్కడ . ట్రంప్ పెట్టిన షరతుకు ఇరాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కిందటి రోజు ఇరాన్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాత్రికి రాత్రే ఇరాన్ మొత్తాన్ని అంతం చేస్తామని.. . దీంతో ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆందోళన పడింది. ఈ క్రమంలోనే ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఇరాన్‌కు మరో రెండు వారాల పాటు గడువు విధించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనతో.. ట్రంప్ అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలనే తక్షణమే షరతుకు లోబడి.. 2 వారాల గడువు ఇచ్చేందుకు.. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ కూడా 10 సూత్రాలతో ఒక ప్రతిపాదన పంపిందని.. అవి సానుకూలంగానే ఉన్నాయన్నారు. చర్చలు కీలక దశకు చేరుకున్నాయని.. శాశ్వత శాంతి ఒప్పందానికి.. పశ్చిమాసియాలో శాంతికి 2 వారాలు సరిపోతుందని చెప్పారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా అంగీకరించింది. ఈ సందర్భంగా యుద్ధం ముగింపు కోసం కృషి చేస్తున్న పాకిస్థాన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలోనే సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాలు.. హర్ముజ్ జలసంధి దగ్గర రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలతో క్రూడాయిల్ ధరలు దిగొచ్చాయి. పెరగడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కూడా మళ్లీ భారీగా పెరిగాయి. అయితే స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీగా పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. హర్ముజ్ జలసంధిలో రాకపోకలు మళ్లీ సజావుగా సాగితే ఇంధన, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు తొలగిపోతాయి. దీంతో ధరలు పెరగకుండా నియంత్రిస్తుందని చెప్పొచ్చు.