Gold Rate Today: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జల సంధిని తెరవాలని, లేదంటే భీకర యుద్ధం ఉంటుందని తెలిపారు. రాత్రికి రాత్రే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేయగలమని హెచ్చరించారు. దీంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దిగిరావడం గమనార్హం. అయితే, ఇరాన్- అమెరికా మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడం కీలకంగా మారింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. రెండు వారాల పాటు ఈ సీజ్ ఫైర్ ఉంటుందని, రెండు దేశాలు ఇందుకు కట్టుబడి ఉంటాయన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజున దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ యుద్ధానికి రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఇస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు ఇరాన్ సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 141 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4798 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 4.67 శాతం మేర దూసుకెళ్లింది. దీంతో సిల్వర్ రేటు ఔన్సుకు 76 డాలర్లు దాటి ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాములపై మరో రూ.820 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు ప్రస్తుతం రూ. 1,49,840 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.750 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,37,350 వద్దకు పడిపోయింది. రూ.5000 తగ్గిన వెండి రేటుబంగారంతో పాటు వెండి ధర సైతం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.5000 మేర దిగివచ్చింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ.2,55,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్లు ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నంలోపు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మారిపోతుంటాయి. కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలోనే స్థానికంగా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది.