: భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్.. కొవిడ్ సమయంలో భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అమ్మకాలతో పాటు ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. కొవిడ్ 2022 ఆఖర్లో కాస్త కుదుటపడటంతో అక్కడి నుంచి మార్కెట్ పుంజుకునేందుకు కాస్త సమయం పట్టింది. 2024 మధ్య నుంచి మళ్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంది. క్రమంగా కొత్త ప్రాజెక్టుల సరఫరా పెరగడం.. అమ్మకాలు పెరగడం జరిగాయి. ధరలు కూడా అలాగే పెరుగుతూ పోయాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో సేల్స్ జరిగాయి. ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్ని కూడా అధిగమించింది. ధరల్లోనూ ముంబైతో పోటీపడటం విశేషం. ఇక సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో జనవరి- మార్చి సమయంలో హౌసింగ్ సేల్స్‌పై ప్రముఖ స్థిరాస్తి సంస్థ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వదిలింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ 3 నెలల వ్యవధిలో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే విక్రయాలు 4 శాతం తగ్గినట్లు పేర్కొంది. విక్రయాలు తగ్గడానికి కారణం ఇళ్ల ధరలు అధిక స్థాయిలో ఉండటం సహా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొందని.. ఇది కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని తెలిపింది నైట్‌ ఫ్రాంక్. గతేడాది ఇదే జనవరి- మార్చిలో ఇళ్ల అమ్మకాలు 88,361 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబై, ఢిల్లీ- NCR, పుణెల్లో ఇళ్ల విక్రయాలు తగ్గగా.. ఇదే సమయంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో చూస్తే ఇళ్ల అమ్మకాలు జనవరి- మార్చి 3 నెలల కాలంలో వార్షిక ప్రాతిపదికన ఒక శాతం మేర పెరిగి 9,541 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరులో 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా నమోదయ్యాయి. చెన్నైలో 9 శాతం పెరిగి 4,763 యూనిట్లుగా ఉండగా.. అహ్మదాబాద్‌లో 2 శాతం, కోల్‌కతాలో 5 శాతం మేర పుంజుకున్నాయి. ఇక ముంబై మహానగరంలో 7 శాతం తగ్గి ఇళ్ల విక్రయాలు 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో హౌసింగ్ సేల్స్ 11 శాతం తగ్గి 12,734 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలోనూ 11 శాతం తగ్గి 12,711 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక్కడ కొత్త ప్రాజెక్టుల సరఫరా కూడా వార్షికంగా 2 శాతం తగ్గి.. 94,855 యూనిట్లకు పరిమితమైందని నైట్ ఫ్రాంక్ తెలిపింది.మరో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ ఈక్విటీ రిపోర్టు మాత్రం కాస్త వేరేగా ఉంది. దీని ప్రకారం.. జనవరి- మార్చిలో . ఇక్కడ దేశంలోని 9 ప్రధాన నగరాల్లో కూడా హౌసింగ్ సేల్స్ 13 శాతం తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఇళ్ల ధరలు స్వల్పంగా పెరిగినట్లు అనరాక్ పేర్కొంది. హైదరాబాద్‌లో 2 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 7,990 కి చేరినట్లు వివరించింది.