మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి మరిన్ని చిక్కులు.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

Wait 5 sec.

ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఉన్న అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నిందితులు.. తమకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్లను ఉప్పరపల్లి కోర్టు మంగళవారం కొట్టేసింది. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిందితులకు బెయిల్ ఇవ్వలేదు. మరోవైపు.. నిర్ణయం తీసుకోనుంది. ఇక బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ డ్రగ్స్ కేసులో నిందితుల నుంచి మరిన్ని కీలక సమాచారం, ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టు ముందు వాదించారు. ఇక కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని.. ఇప్పుడు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారులు తారుమారు అయ్యే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. మరోవైపు.. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసు దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఈ సందర్భంగా కోర్టులో విచారణ జరిగింది. తమ కస్టడీకి నిందితులను అప్పగిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలను రాబడతామని పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయి.. అసలు డ్రగ్స్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారు.. అనే కోణంలో మరింత లోతైన విచారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేసింది. దీంతో కోర్టు వారిని పోలీస్ కస్టడీకి ఇస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. ఈ కేసులో ఏ1గా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డిపై సిట్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వీడియోలు.. ఫోన్ కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు.. నిందితుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా.. కేసు విచారణను మరింత ముమ్మరం చేస్తున్నారు. నిందితులను ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే.. వారిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పోలీసులు విచారణ జరిపే అవకాశాలున్నాయి.