: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేని వారు, దీర్ఘకాలంలో హైరిటర్న్స్ కోరుకునే వారు ముఖ్యంగా యువత ఎక్కువగా వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో 2026, మార్చి నెలలలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి. మార్చి నెలలో మొత్తం రూ.40,450 కోట్ల మేర కొత్త పెట్టుబడులు వచ్చినట్లు ఏఎంఎఫ్ఐ డేటా వెల్లడించింది. ఉండగా 61 శాతం మేర పెరిగి ఈ మార్చి 2026లో రూ.40,450 కోట్లకు చేరుకున్నాయి. అలాగే నెలవారీగా చూసుకుంటే 2026, ఫిబ్రవరి నెలలో రూ.25,977 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 56 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న 11 కేటగిరీల్లో అత్యధికంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ (Flexi Cap Funds) ఎక్కువగా పెట్టుబడులను రాబట్టాయి. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారని చెప్పవచ్చు. కేవలం ఈ ఫండ్స్‌లోకే రూ.10,054 కోట్ల మేర పెట్టుబడులు రావడం గమనార్హం. అంతే కాదు వరుసగా రెండో నెలలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్ రెండో స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీ పథకాల్లోకి మార్చి 2026 నెలలో రూ.6,263 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి.అయితే, ట్యాక్స్ సేవర్ ఫండ్స్, డివిడెండ్ ఫండ్స్ నుంచి మాత్రం నిధులు తరలి వెళ్లాయి. మరి ఆ జాబితా ఓసారీ పరిశీలిద్దాం. మల్టీక్యాప్ ఫండ్స్ లోకి రూ.2981.55 కోట్లులార్జ్ క్యాప్ ఫండ్స్ లోకి రూ.2,997.84 కోట్లులార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి రూ.5307.25 కోట్లుమిడ్ క్యాప్ ఫండ్స్ లోకి రూ.6063.53 కోట్లుస్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి రూ.6263.56 కోట్లుడివిడెండ్ యీల్డ్ ఫండ్స్ నుంచి రూ.59.21 కోట్లు వెనక్కి వెళ్లాయి. వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్స్ లోకి రూ.2155.55 కోట్లు వచ్చాయి. ఫోకస్ట్ ఫండ్స్‌లోకి రూ. 2424.59 కోట్లుసెక్టోరల్, థెమాటిక్ ఫండ్స్ లోకి రూ.2687.82 కోట్లుఈఎల్ఎస్ఎస్ స్కీమ్ నుంచి రూ.437.34 కోట్లు వెనక్కి వెళ్లాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లోకి రూ.10,054.12 కోట్లు వచ్చాయి. మొత్తంగా మార్చి నెలలో రూ.40,450.26 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.