టాక్స్‌పేయర్లకు అలర్ట్.. ఇలా కొత్త పన్ను విధానంలో రూ. 15.85 లక్షల వరకు ఆదాయంపైనా జీరో టాక్స్..!

Wait 5 sec.

New Tax Regime: మన దేశంలో నిర్దిష్ట ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. . ఆదాయపు పన్ను చట్టం.. టాక్స్ శ్లాబుల ఆధారంగా ఇక్కడ పన్ను చెల్లించాల్సి వస్తుంది. కొంత కాలంగా చూస్తే కేంద్రం ఎక్కువగా కొత్త పన్ను విధానాన్నే ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇక్కడే పన్ను రేట్లను తగ్గిస్తుండటం సహా టాక్స్ రిబేట్ పరిమితిని పెంచుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెంచింది. పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయట్లేదు. ప్రస్తుతం పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపైనే టాక్స్ ఉండదు. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలతో కలుపుకుంటే రూ. 5.50 లక్షల వరకు టాక్స్ పడదు. కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలిపి రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ ఉండదు. అయితే ఈ రేట్లు ఇలా ఉన్నా.. ఇతర కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. పాత పన్ను విధానంలో ఆ ఆదాయ పరిమితి దాటితే.. ఇతర పన్ను మినహాయింపులకు అవకాశం ఉంటుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు పొందొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులు, హోం లోన్ అసలు, ఈపీఎఫ్ డిపాజిట్లు సహా హెల్త్ ఇన్సూరెన్స్, అద్దె భత్యం, ఎన్‌పీఎస్ పథకాల్లో పెట్టుబడులు ఇలాంటి వాటిపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పన్ను విధానంలో పెద్దగా ఇలాంటి పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు లేనప్పటికీ.. టాక్స్ రిబేట్ పరిమితి ఎక్కువగా ఉంది. అంటే రూ. 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ పడదు. వేతన జీవులు.. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ ఉండదు. అయితే ఆపైన ఆదాయంపైనా కొంత వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో రూ. 15.85 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ చెల్లించకుండా ఎలా ఉండొచ్చో చూద్దాం. . మీల్ వోచర్లపైనా ఇక్కడ పన్ను మినహాయింపులు పొందొచ్చు. సాధారణంగా రూ. 15- 16 లక్షల మధ్య ఆదాయంపై టాక్స్ శ్లాబు రేటు 15 శాతంగా ఉంది. దీని ప్రకారం రూ. 15.85 లక్షల ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు తీసేస్తే రూ. 15.10 లక్షలపై లెక్కించాలి. దీని ప్రకారం.. టాక్స్ లెక్కిస్తే చెల్లించాల్సింది రూ. 1,06,500 గా ఉంటుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4 శాతం కలుపుకుంటే మొత్తం టాక్స్ రూ. 1,10,760 చెల్లించాల్సి వస్తుంది. >> ఇటీవల కేంద్రం ప్రకటించిన కొత్త ప్రయోజనాలు మీరు పొందగలిగితే.. ఎక్కువే టాక్స్ ఆదా చేసుకోవచ్చు. వర్తిస్తుంది. ఈ లెక్కన రోజుకు రెండు మీల్స్ లెక్కన చూసినా నెలకు 22 పని దినాల్లో కలిపి నెలకు రూ. 8800 వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇదే సంవత్సరానికి అయితే రూ. 1,05,600 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక రూ. 15.85 లక్షల ఆదాయంపై బేసిక్ శాలరీ 50 శాతం అంటే రూ. 7.92 లక్షలుగా ఉంటుంది. యజమాని చెల్లించే పీఎఫ్ వాటా కొత్త పన్ను విధానంలో పన్ను రహితమే. ఇది బేసిక్ పే లో 12 శాతంగా ఉంటుంది. అప్పుడు మీ బేసిక్ పే రూ. 7.92 లక్షల్లో 12 శాతం.. అంటే రూ. 95,100 మైనస్ చేయాలి. ఇది పన్ను రహితం. ఇంకా మీరు NPS పథకంలో చేరితే ఇక్కడ యజమాని జమ చేసే NPS డిపాజిట్లపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది బేసిక్ పే లో గరిష్ఠంగా 14 శాతం వరకు ఉంటుంది. అప్పుడు రూ. 7.92 లక్షల బేసిక్ పేలో 14 శాతం రూ. 1,10,950 మైనస్ చేయాలి. కాబట్టి.. రూ. 15.85 లక్షల జీతంలో నుంచి ముందుగా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలు మైనస్ చేయండి. అప్పుడు రూ. 15.10 లక్షలు అవుతుంది. మీల్ వోచర్స్ ద్వారా పన్ను మినహాయింపు వర్తించే రూ. 1,05,600 తీసేయండి. అప్పుడు పన్ను వర్తించే ఆదాయం రూ. 14,04,400 గా ఉంటుంది. మళ్లీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ. 95,100; NPS కాంట్రిబ్యూషన్ రూ. 1,10,950 కూడా మైనస్ చేయండి. అప్పుడు ఆదాయం రూ. 11,98,350 అవుతుంది. ఇది రూ. 12 లక్షల్లోపే ఉంది కాబట్టి ఇక్కడ టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.Disclaimer: పైన ఇచ్చింది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ఆర్థిక సలహాగా పరిగణనలోకి తీసుకోవద్దు. పన్ను చట్టాల్ని బట్టి ఇక్కడ మార్పులు ఉండొచ్చు. నిర్దిష్ట పరిస్థితుల్ని బట్టి.. వ్యక్తుల్ని బట్టి.. ఇక్కడ మార్పులు ఉండొచ్చు. అందుకే.. దీని గురించి పూర్తి సమాచారం లేదా పెట్టుబడులు పెట్టేందుకు సమాచారం కోసం సెబీ గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల్ని సంప్రదించండి.