ఒక్కరోజే ఏకంగా 20 శాతం పెరిగిన షేరు.. అప్పర్ సర్క్యూట్‌లో లాక్.. ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది!

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ స్టాక్ ఎప్పుడు.. ఎందుకు పెరుగుతుందో ముందుగానే ఊహించడం కష్టం. ఎన్నో అంశాలు.. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్చి నెలలో సూచీలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. సెన్సెక్స్ 11 శాతానికిపైగా పడిపోగా.. ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. అయితే.. మళ్లీ యుద్ధం ముగింపుపై సంకేతాలతో.. ఆశలతో.. సూచీలు ఏప్రిల్ నెలలో కాస్త రాణిస్తున్నాయి. ఇటీవల ఇరాన్- అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా.. ఏప్రిల్ 8న సూచీలు భారీగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 3 వేల పాయింట్ల వరకు పెరిగింది.అయితే . దీంతో సూచీలు మళ్లీ పతనం అయ్యాయి. సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్లకు మరోసారి నష్టాలు ఎదురయ్యాయి. ఇక ఇప్పుడు ఏప్రిల్ 10న మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. సూచీలు దూసుకెళ్లాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 3 గంటలకు సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా పెరగడంతో 77,400 పాయింట్ల స్థాయిలో ఉంది. నిఫ్టీ 220 పాయింట్లు పుంజుకొని 24 వేల మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇవాళ పలు హెవీ వెయిట్ స్టాక్స్ పుంజుకున్నాయి. రిలయన్స్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్ సహా ప్రముఖ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు వంటివి పుంజుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు. ఇక్కడే మనం కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కిందటి రోజు NSE లో రూ. 316.85 వద్ద ముగియగా.. ఇవాళ ఆరంభంలో 2 శాతం వరకు లాభాలతో మొదలైంది. అక్కడితో ఆగలేదు. ఇంట్రాడేలో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ. 380.20 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాల పంట పండిందని చెప్పొచ్చు. గమనిక: స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. అప్పుడు రిస్క్ పెద్దగా ఉండదు.