పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో మరికొద్ది గంటల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాక్, ఇజ్రాయెల్‌ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఓ పోస్ట్ ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ నరమేధం సృష్టిస్తోందని, అది ఓ ‘దుష్ట శక్తి’అని, ‘మానవాళికి శాపం’ అంటూ ఖవాజా ఆసిఫ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పాకిస్థాన్ రక్షణ మంత్రి తన పోస్ట్‌ను తొలగించారు. ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని వాదిస్తోన్న ఇజ్రాయెల్.. ఆ దేశంపై భీకర దాడులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘ఇస్లామాబాద్‌లో జరుగుతుంటే... లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోంది.. ముందు గాజా, ఇప్పుడు లెబనాన్‌లో అమాయకులను ఇజ్రాయెల్ చంపుతోంది.. అప్పుడు ఇరాన్, ఇప్పుడు లెబనాన్‌లో రక్తపాతం నిరంతరాయంగా సాగుతోంది.. ఐరోపా యూదులను వదిలించుకోవడానికి పాలస్తీనా భూభాగంపై ఈ కేన్సర్ లాంటి రాజ్యాన్ని సృష్టించిన వారు నరకంలో కాలిపోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఆసిఫ్ తీవ్రపదజాలంతో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలన్న పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అన్నారు. ‘‘ఏ దేశం నుంచి కూడా ఇలాంటి ప్రకటన సహించలేం... ప్రత్యేకించి శాంతికి తటస్థ మధ్యవర్తిగా ఉంటామని చెప్పుకునే దేశం నుంచి అస్సలు సహించబోం’’ అని నెతన్యాహు కార్యాలయం పోస్ట్ చేసింది. అలాగే, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ఇవి కేవలం రాజకీయ విమర్శలు కావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకునే యూదు వ్యతిరేక రక్తపాత ప్రేరేపిత వ్యాఖ్యలని దుయబట్టారు.ఇజ్రాయెల్‌ను ‘కేన్సర్’తో పోల్చడం వినాశనానికి పిలుపునివ్వడమేనని ఆయన హెచ్చరించారు. ‘వినాశనానికి పాల్పడే ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటుంది’ అని ఉద్ఘాటించారు. లెబనాన్‌పై దాడులను పాక్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించడంతో మొదలైన పరిణామాల పరంపర‌తో ఇజ్రాయెల్ ఈ విధంగా స్పందించింది. అనంతరం ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆసిఫ్ తన పోస్ట్‌ను తొలగించారు.