అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. చేపడుతోంది. అమరావతిని అద్భుతమైన, సుందరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపడుతోంది. అందులో భాగంగా అధికారులు చేపట్టిన ఓ కార్యక్రమం ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తోంది. కాసియా ఫిస్టులా (Cassia fistula) అనే చెట్టును అమరావతిలో పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనినే రేలా అని, గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలస్తుంటారు. అయితే ప్రాంతంలో ఈ మొక్కను పెంచే క్రమంలోనే భాగంగా.. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులకు కాసియా ఫిస్టులా ఎంతమేరకు అలవాటు పడుతుందనే విషయాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు.ఇందులో భాగంగా రాయపూడిలోని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయం బ్లాక్-4 ముందు ప్రయోగాత్మకంగా కాసియా ఫిస్టులా మొక్కను నాటారు. ఈ మొక్క రాజధాని ప్రాంతపు వాతావరణానికి అద్భుతంగా అలవాటుపడి, కనువిందు చేసేలా పూలు పూస్తోంది. తక్కువ కాలంలోనే బాగా పెరిగి, మొదలు నుంచి పైవరకు దట్టమైన తెలుపు, పసుపు రంగు పూలను పూస్తోంది. దీంతో రాజధాని అంతటా కాసియా ఫిస్టులా మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాసియా ఫిస్టులా.. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన పసుపు రంగు పూలకు ప్రసిద్ధి చెందింది. అయితే అమరావతిలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన మొక్కలో పసుపు రంగుతో పాటుగా తెలుపు రంగు పూలు కూడా పూయటం విశేషం. దీంతో దీనిని రాజధాని అంతటా విస్తృతంగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేశంలోని, అలాగే విదేశాలకు చెందిన మొక్కలను కూడా పెంచాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దీంతో అమరావతిలో ప్రకృతి అందంతో పాటుగా పర్యావరణానికి కూడా మేలు చేసేలా, కంటికి ఇంపుగా కనిపిస్తూనే వాతావరణ మార్పులను తట్టుకోగల వృక్ష జాతులను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు..ఈ నేపథ్యంలో కాసియా ఫిస్టులా మొక్కను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. కాసియా ఫిస్టులా పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో.. సచివాలయం పరిసరాల్లో 40కి పైగా కాసియా ఫిస్టులా మొక్కలను నాటి, పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకంలో రసాయనాలను ఉపయోగించడం లేదు. అలాగే జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించి ఈ మొక్కలను పెంచుతున్నారు. కాసియా ఫిస్టులా చెట్టు పర్యావరణ పరంగానే కాకుండా అనేక ఔషధ విలువలు కలిగి ఉందని అధికారులు తెలిపారు. కాసియా ఫిస్టులా అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని, ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. ఆయుర్వేదంలోనూ దీనిని ఉపయోగిస్తారని.. కొన్ని వృద్ధాప్య నిరోధక చికిత్సలలో ఉపయోగిస్తారని అధికారులు చెప్తున్నారు. కాసియా ఫిస్టులా చెట్టు ప్రత్యేకతకాసియా ఫిస్టులా చెట్టు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు పూస్తుంది, మార్చి, మే నెలల మధ్య ఎక్కువగా పూలు పూస్తుంది. అలాగే అక్టోబర్, నవంబర్ నెలల రెండోసారి పూస్తుంది. ఈ చెట్టుకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. పూలు ఎక్కువగా పూసే సమయంలో.. చెట్టు ఆకులు ఎక్కువగా రాలిపోతాయి. దీంతో మొత్తం చెట్టును పువ్వులే ఆక్రమించి.. గుత్తులు, గుత్తులుగా కిందకు వేలాడుతూ చూసేవారికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఒక్కో చెట్టు 500 నుంచి వేయి వరకూ పూల గుత్తులను పూస్తుంది. ఇది అద్భుతమైన ప్రకృతి అందాన్ని కల్గిస్తుందని అధికారులు చెప్తున్నారు. అమరావతి వాతావరణాన్ని తట్టుకుని నిలబడటంతో పాటుగా.. ఏడాదికి రెండు సార్లు పూలు పూయటం, ఎక్కువగా ఆక్సిజన్ విడుదల చేస్తూ గాలి నాణ్యతను మెరుగుపరచటం వంటి కారణాలతో కాసియా ఫిస్టులా పెంపకాన్ని చేపడుతున్నారు.