రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం భూములు వస్తున్నాయి: వైఎస్ జగన్

Wait 5 sec.

ఇది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, అధినేత మోహన్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్న వైఎస్ జగన్.. తాజాగా ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, నేతలతో వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై మాట్లాడిన జగన్.. సంస్థలకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులపైనా విమర్శలు గుప్పించారు. రూపాయి తీసుకుని షాపుకు వెళ్తే చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ.. ఏపీలో రూపాయికే కోట్ల విలువైన భూములు వస్తాయంటూ వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం.. 99 పైసలకే ఎకరా భూమి కేటాయిస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ఈ విమర్శలు చేశారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు 99 పైసలకు ఎకరా చొప్పున భూములు కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో, .. ఎకరాకు 99 పైసలు చొప్పున టోకెన్ ధరతో కేటాయించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎకరా 99 పైసలు అనే సింబాలిక్ ప్రైస్‌ను ఏపీ ప్రభుత్వం ఎంచుకుంది. ఈ పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలను ఎక్కువగా ఆకర్షించి ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ (LIFT) 4.0ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పాలసీ కింద ఏపీలో పెట్టుబడులు పెట్టే ఐటీ సంస్థలకు ఎకరం భూమి 99 పైసల చొప్పున కేటాయిస్తారు. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. భూములు పొందిన తర్వాత సదరు సంస్థ లేదా కంపెనీ నిర్దేశిత అనుమతులతో నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయంలోగా నిర్మాణాలను ప్రారంభించకపోతే భూమలను వెనక్కి తీసుకునేలా నిబంధనలు పొందుపరిచారు. ఈ పాలసీ కింద భూముల రాయితీ పొందాలంటే ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలు అయితే గత మూడు సంవత్సరాలలో ఫార్చ్యూన్‌ లేదా ఫోర్బ్స్‌ ర్యాంకింగ్‌లో లిస్టింగ్ అయ్యి ఉండాలి. కనీసం ఒక బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగి ఉండాలి. మూడు సంవత్సరాలలో కనీసం మూడు వేల మందికి ఉపాధి కల్పించటంతో పాటుగా.. ఎకరానికి సగటున 500 ఉద్యోగాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే క్యాపిటల్ ఇన్‌వెస్ట్‌మెంట్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంస్థలను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ పాలసీ తీసుకువచ్చింది.