ఆగని ఉద్యోగాల కోత.. అమెజాన్‌లో మరో 14000 లేఆఫ్స్.. 3 నెలల్లో 30 వేల మంది ఔట్?

Wait 5 sec.

Amazon layoffs: మల్టీనేషనల్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకసారి వేలాది మందిని తొలగించిన ఈ కంపెనీ మళ్లీ భారీగా ఉద్యోగులను ఇళ్లకు పంపించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. వచ్చే నెల మేలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలను కంపెనీ ప్రతినిధి ఒకరు కొట్టిపారేశారు. వాటిల్లో ఎలాంటి నిజం లేదని, పూర్తిగా అసత్యాలుగా పేర్కొన్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం కంపెనీలో జరుగుతోన్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారీ స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి 14 వేల మందిని తొలగిస్తున్నారని తెలిపాయి. అయితే, మే నెలలో ఏ తేదీలోపు ఈ ఉంటాయనే వివరాలను వెల్లడించలేదు. ఈసారి లేఆఫ్స్ విషయంలో అమెజాన్ కఠినంగా ఉందని, ఈ విషయాలు తెలిసిన వ్యక్తులపై గట్టి నిఘా పెట్టాయని సంబంధిత వర్గాలు తెలిపినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ది లేయ్ ఫెగ్ నెట్‌వర్క్ రిపోర్ట్ ప్రకారం ఈ లేఆఫ్స్‌లో ప్రధానంగా వైట్-కాలస్ ఉద్యోగులు, మిడిల్ మేనేజ్మెంట్ జాబ్ లెవెల్స్ ఎల్5 నుంచి ఎల్7 వరకు ఉన్న వారిపై ప్రభావితం అవుతారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది. తాజా లేఆఫ్స్‌లో వైర్ హౌస్, లాజిస్టిక్స్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండనిద తెలుస్తోంది. అలాగే చైనాలోని కొన్ని టీమ్స్ పూర్తిగా ఈ లేఆఫ్స్ ద్వారా కంపెనీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టం, ఏఐ ద్వారా కొన్ని పనులను భర్తీ చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం వంటి కారణాల ద్వారానే భారీ స్థాయిలో లేఆఫ్స్ చేపడుతున్నట్లు సమాచారం. 3 నెలల్లో 30 వేల మంది ఔట్? అవుతుంది. ఈ ఏడాది 2026, జనవరి నెలలోనే అమెజాన్ ఏకంగా 16 వేల మందిని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మే నెల లేఆఫ్స్‌తోనే ఈ ప్రక్రియ ఆగదని అర్థమవుతోంది. కొన్ని నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్ చేపట్టాలని అమెజాన్ నిర్ణయించినట్లు ఆ కంపెనీ హెచ్ఆర్ చీఫ్ బెత్ గలెట్టి తన ఉద్యోగులతో చెప్పిన మాట్లను బట్టి అర్థమవుతోందని మీడియా కథనాలు తెలిపాయి.