ITR ఫైలింగ్ నుంచి TDS సర్టిఫికెట్ వరకు.. ఈ ఏడాది ట్యాక్స్ 'డెడ్‌లైన్స్' ఇవే.. ఏ తేదీలోపు ఏ పని పూర్తి చేయాలంటే?

Wait 5 sec.

Income tax deadlines for FY27: కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైంది. ఈ సంవత్సరం నుంచి కొత్త చట్టం 2025, కొత్త ఆదాయపు పన్ను నియమావళి 2026 సైతం అమలులోకి వచ్చాయి. అలాగే ఆదాయపు పన్ను చెల్లింపులు, ఐటీఆర్ ఫైలింగ్, టీడీఎస్ సర్టిఫికెట్ల వంటి ముఖ్యమైన పనులు పూర్తి చేసేందుకు కొన్ని నిర్దేశిత గడువు తేదీలు ఉంటాయి. ఇచ్చిన సమయంలోనే ఆయా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే భారీగా పెనాల్టీలతో పాటు కొన్నిసార్లు చట్టపరమైన చర్యలూ ఎదుర్కోవలసి వస్తుంది. సకాకుండా అనవసరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ ఏడాదిలో పన్నులకు సంబంధించిన గడువు తేదీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 14వ తేదీసెక్షన్ 194 ఐఏ, 194 ఐబీ, 194బీ, 194 ఎస్ కింద పలు ట్రాన్సాక్షన్లకు సంబంధించి చేస్తారు. స్టాక్ ఎక్స్చేంజీలు, గుర్తింపు పొందిన సంస్థలు క్లయింట్ కోడ్ మార్పు రిపోర్ట్ చేస్తాయి. అలాగే ఫారం 15సీసీ ద్వారా త్రైమాసిక విదేశీ ట్రాన్సాక్షన్ల స్టేట్మెంట్స్ జారీ చేస్తారు. ఏప్రిల్ 30వ తేదీప్రభుత్వేతర డిడక్టర్లు మార్చి-2026 నెలకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ చెల్లించేందుకు చివరి తేదీ. ప్రభుత్వ ఆఫీసులు ఫారం 24జీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇతర పెట్టుబడుల ద్వారా వడ్డీ ఆదాయం వచ్చే వారు ఫారం 15జీ, ఫారం 15హెచ్ సమర్పించేందుకు గడువు ఇదే. పెన్షన్ ఫండ్స్, సావెరిన్ వెల్త్ ఫండ్స్ త్రైమాసిక గణాంకాలు వెల్లడికి, మార్చి నెల టీడీఎస్ కోసం ఛాలన్, స్టేట్మెంట్ డిపాజిట్ గడువు ఇదే. మే 7వ తేదీఏప్రిల్ నెలకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ డిపాజిట్ గడువు. కొత్త ట్యాక్స్ నిబంధనల ప్రకారం ట్యాక్స్-ఫ్రీ గూడ్స్ కొనుగోలుకు సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలి. మే 15వ తేదీప్రత్యేక ట్రాన్సాక్షన్లకు సంబంధించి టీడీఎస్ సర్టిఫికెట్ జారీకి డెడ్‌లైన్. టీసీఎస్ త్రైమాసిక స్టేట్మెంట్, క్లయింట్ కోడ్ మార్పు రిపోర్టింగ్ గడువు ఇదే. మే 30వ తేదీగత ఆర్థిక సంవత్సరం 2025-26లోని నాలుగో త్రైమాసికానికి సంబంధించిన టీసీఎస్ సర్టిఫికెట్ సమర్పణకు గడువు. బిజినెస్ ట్రాన్సాక్షన్ల కోసం సెక్షన్ 285బీ కింద రిపోర్ట్ చేసేందుకు డెడ్‌లైన్. మే 31వ తేదీఫారం 61ఏ ద్వారా యాన్యువల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ చేయాలి. పాన్ అలాట్మెంట్ కోసం అప్లై చేసుకోవడం, ఫారం 61బీ, ఫారం 10బీడీ సమర్పణకు గడువు. అలాగే ఉద్యోగుల సూపర్ యాన్యుయేషన్ ఫండ్ రిటర్న్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 7వ తేదీమే నెలకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ సమర్పించాలి. మే నెలలో కొనుగోలు చేసిన వాటికి సంబంధించి కొనుగోలుదారు డిక్లరేషన్ ఇవ్వాలి. జూన్ 15వ తేదీశాలరీ, నాన్ శాలరీ పేమెంట్లకు సంబంధించిన టీడీఎస్ సర్టిఫికెట్ జారీ చేయాలి. ఈ ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ల తొలి విడత చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక టీడీఎస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీయూనిట్ హోల్డర్లకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రిపోర్ట్ చేయాలి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్లు, సంబంధిత వివరాలు అందించాలి. మే నెలకు సంబంధించిన టీడీఎస్ ఛాలన్ కమ్ స్టేట్మెంట్ ఫైలింగ్ చేయాలి. జూలై 31వ తేదీఉద్యోగులు, నాన్-ఆడిట్ ట్యాక్స్ పేయర్లు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ తేదీలోపు ఫైల్ చేయాలి. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఉంటే పేమెంట్ చేయాలి. సెప్టెంబర్ 15వ తేదీఅడ్వాన్స్ ట్యాక్స్ రెండో విడత చెల్లించాలి. మొత్తం ట్యాక్సులో 45 శాతం పూర్తి చేయాలి. అక్టోబర్ 31వ తేదీఆడిట్ అవసరమైన ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ చేయాలి. నవంబర్ 30వ తేదీట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ ఫైలింగ్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 15వ తేదీఅడ్వాన్స్ ట్యాక్స్ మూడో విడతలో భాగంగా 75 శాతం పన్ను చెల్లించాలి. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకుని రివైజ్డ్ రిటర్న్స్ లేదా బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జనవరి-ఫిబ్రవరి 2027లోఎంచుకున్న ట్యాక్స్ విధానంలో భాగంగా పన్ను ఆదా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పని చేస్తున్న కంపెనీకి తమ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు అందించాలి. మార్చి 15, 2027 మార్చి 31, 2027పాత పన్ను విధానం ఎంచుకున్న వారు పన్ను ఆదా పెట్టుబడులు చేసేందుకు ఇదే లాస్ట్ తేదీ. అలాగే పాత సంవత్సరాలకు సంబంధించిన రివైజ్డ్, బిలేటెడ్ రిటర్నులు ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది.