బంగారం భారీగా కొంటున్న కేంద్ర బ్యాంకులు.. ఫిబ్రవరిలో 19000 కిలోల గోల్డ్ కొనుగోలు.. ఆ ఒక్క దేశమే ఏకంగా..!

Wait 5 sec.

Gold Purchase: ఒకప్పుడు బంగారం అంటే అందాన్ని పెంచే ఆభరణంగానే చూసే వారు. కానీ, పరిస్థితులు మారిపోయాయి. బంగారం విలువ భారీగా పెరుగుతున్న క్రమంలో అది ఒక ఆర్థిక వనరుగా మారిపోయింది. అత్యవసర సమయంలో ఆర్థికంగా ఆదుకుంటుందని ప్రజలతో పాటు దేశ ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. దేశంలో ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత పటిష్ఠంగా ఉంటుందని భావిస్తున్నాయి.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ గత ఫిబ్రవరి నెలలోనూ పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం భారీగా కొనుగోలు చేశాయి. బంగారం ధరలు భారీగా పెరిగేందుకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా పసిడి నిల్వలను పెంచుకోవడమూ ఒక కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2026 నెలలోనూ పలు దేశాల కేంద్ర బ్యాంకులు నికరంగా 19 టన్నుల బంగారం (19000 కిలోల పసిడి) కొనుగోలు చేసినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (WGC) తెలిపింది. ఇందులో ఒక్క పోలండ్ దేశమే భారీగా కొనుగోలు చేసింది. ఈ దేశం గత ఫిబ్రవరి నెలలో ఏకంగా 20 టన్నులు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ 8 టన్నులు, చెక్ రిపబ్లిక్ 2 టన్నులు, మలేషియా 2 టన్నులు, చైనా-కాంబోడియా 1 టన్ను చొప్పున కొనుగోలు చేశాయి. మొత్తంగా ఆయా దేశాలు 33 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అయితే, ఫిబ్రవరిలో రెండు దేశాలు భారీగా బంగారం విక్రయించాయి. అందులో టర్కీ, రష్యాలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో టర్కి ఏకంగా 8 టన్నుల బంగారాన్ని విక్రయించగా, రష్యా 6 టన్నుల బంగారాన్ని విక్రయించింది. దీంతో ఫిబ్రవరిలో నికరంగా 19 కిలలో బంగారం కొనుగోలు చేసినట్లయింది. ఇప్పుడు మళ్లీ అదే దేశం ఈ ఏడాది ఫిబ్రవరి లోనూ రికార్డ్ స్థాయిలో 20 టన్నుల బంగారం కొనుగోలు చేయడం గమనార్హం. మొత్తం బంగారం నిల్వలను 700 టన్నులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆ దేశం వద్ద 570 టన్నుల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 10 శాతంగా ఉంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం 2308 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇక బంగారాన్ని కొనుగోలు చేయడం చెక్ రిపబ్లిక్ దేశానికి వరసుగా 36వ నెల కావడం గమనార్హం. ఆ తర్వాత చైనా వరుసగా 16వ నెల, ఉజ్బెకిస్తాన్ వరుసగా 5వ నెలలో బంగారం కొనుగోలు చేశాయి.