పట్టాలెక్కనున్న మరో వందే భారత్ స్లీపర్ రైలు.. ఆ మార్గంలోనే, ఈ ఏడాది చివరి నాటికి మరో 12 రైళ్లు

Wait 5 sec.

స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి దశలవారీగా వందకు పైగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం.. ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో.. దేశంలోని మిగిలిన దూర ప్రాంతాలకు కూడా ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈసారి దక్షిణాదికి వందేభారత్ స్లీపర్‌ రైలును ఆమోదించింది. ముంబై నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి.. ఈనెల 5వ తేదీన బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్‌కు రాసిన లేఖలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తేల్చి చెప్పారు.అయితే ఈ బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ మార్గంలో నడుస్తుంది.. ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది.. టికెట్ ధర ఎంత అనే సమాచారాన్ని రైల్వే శాఖ త్వరలోనే వెల్లడించనుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి ముంబైకి సుమారు 1,134 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలంటే.. 22 గంటల సమయం పడుతుండగా.. ఈ అందుబాటులోకి వస్తే.. అది కేవలం 16 గంటల్లోనే చేరుకోవచ్చని రైల్వే శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. 3 నెలల క్రితం దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభమైంది. కామాఖ్య నుంచి హౌరా మధ్య నడుస్తున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు.. కేవలం 119 ట్రిప్పుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. దీంతో ఏకంగా 1.21 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.