వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. యుద్ధం జరుగుతున్నా లోన్లు తీసుకునే వారికి బిగ్ రిలీఫ్!

Wait 5 sec.

: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 8న కీలక ప్రకటన చేసింది. 3 రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం జరగ్గా.. ఏప్రిల్ 8న (బుధవారం) సమీక్ష నిర్ణయాల్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ . మరోసారి కీలక వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25 శాతంగా ఉంది. అంతకుముందు ఫిబ్రవరి సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 లో ఇదే తొలి సమీక్ష. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటంతో.. బ్యాంకులు పెద్దగా లోన్లు సహా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు లేవు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని మల్హత్రా చెప్పారు. అయినప్పటికీ జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇటీవల నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే వంటగ్యాస్ ధరలు, ఏటీఎఫ్ ధరలు, ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు వంటివి పెరిగాయి. క్రూడాయిల్ రేట్లు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఈసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. మరోసారి రెపో రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించగా.. లోన్లు తీసుకునేవారు ఊపిరిపీల్చుకున్నారు. గతేడాది ద్రవ్యోల్బణం తగ్గుతూ వచ్చిన క్రమంలో.. ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి సమయంలో గరిష్ఠంగా రెపో రేటు 6.50 శాతంగా ఉండగా.. తొలుత గతేడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. తర్వాత మళ్లీ ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి దీనిని 6 శాతానికి తీసుకొచ్చింది. జూన్‌లో అయితే ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి తీసుకొచ్చింది. మళ్లీ డిసెంబరు సమీక్షలో కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చింది.ఇలా మొత్తంగా 11 నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 1.25 శాతం లేదా 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది లోన్లు తీసుకునే వారికి భారీగా ఊరట కల్పించింది. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తే.. దానికి అనుగుణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ రెపో రేటుకు లింక్ అయి ఉండే లోన్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. దీంతో గతేడాది లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు భారీగా తగ్గించాయి. ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ తగ్గింది. కొత్తగా లోన్లు తీసుకునేవారికి తక్కువ వడ్డీ రేటుకే లభించాయి. అయితే ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు భారీగా తగ్గించి చారిత్రక కనిష్ఠాలకు చేర్చాయి.లాభాల్లో స్టాక్ మార్కెట్లు... సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్ 2600 పాయింట్లకుపైగా లాభంతో మొదలవగా.. 2800 పాయింట్లకుపైగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపద కూడా రికార్డు స్థాయిలో ఇవాళ ఒక్కరోజే రూ. 15 లక్షల కోట్లకుపైగా ఎగబాకింది. క్రూడాయిల్ ధరలు గరిష్ఠాల నుంచి 20 శాతం వరకు పతనం అయ్యాయి.