RR vs MI: పిల్ల బచ్చాలు పిచ్చికొట్టుడు కొడుతుంటే.. టెంపర్ కోల్పోయిన రోహిత్ శర్మ

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ల మెంటల్ మాస్ బ్యాటింగ్‌కి వరల్డ్ క్లాస్ ప్లేయర్లయిన ముంబై ఆటగాళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదర్దు యువ ఆటగాళ్లు ఎంతో అనుభవం ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్లను ఉతికారేశారు. బుమ్రా, బౌల్ట్ అన్న తేడా లేకుండా బంతి పడితే బౌండరీ బాదడమే టార్గెట్ అంటూ రెచ్చిపోయారు. ఆ వెళ్లిన బౌండరీలు కూడా ఏవో ఎడ్జ్ తీసుకొనో, లేక బై లక్ మీదో వెళ్లినవి కావు.. డిసైడ్ చేసిన కొట్టిన షాట్స్. ఒక్కో షాట్ కొడుతుంటే స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుల్లో పడుతుంది. వాంఖడే, ఈడెన్ గార్డెన్స్ లాంటి చిన్న గ్రౌండ్ అయితే ఓకే.. కానీ బౌండరీలు ఎక్కువ దూరం ఉండే ఏసీఏ స్టేడియంలో ఇలాంటి షాట్స్ చూసి టీమిండియా మాజీ కెప్టెన్ సైతం షాక్ అయ్యాడు.ముంబై బౌలర్లను చితక్కొడుతుంటే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెంపర్ కోల్పోయాడు. లెంగ్త్ ఏంటీ, లైన్ ఏంటంటూ బౌండరీ లైన్ దగ్గర ఉంటూ అసహనం వ్యక్తం చేశాడు. తొలి ఐదు ఓవర్ల వరకు ఓపెనర్లలో ఒక్కర్ని కూడా అవుట్ చేయకపోవడం, పైగా 15 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు మోత మోగిస్తుంటే బౌలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాతే హార్దిక్ పాండ్యా, బుమ్రా సలహాలతో శార్దూల్ ఠాకూర్ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ ఐదు ఓవర్లలోనే 80 పరుగులు బాదేశారు. యశస్వి జైస్వాల్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలవడం, వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 39 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 150/3 పరుగులు చేసింది. అయితే, భారీ టార్గెట్ ముందు ముంబై ఓపెనర్లు బోల్తా కొట్టారు. ర్యాన్ రికెల్టన్ తొలి ఓవర్‌లోనే అవుటవ్వడంతో మ్యాచ్‌కి ఎండ్ కార్డు పడ్డట్టయింది. రోహిత్ శర్మ కూడా నిరాశే మిగిల్చాడు. తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడిన షానా కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. ఆరు బంతులు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 5 పరుగులు చేసే అవుటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కు ప్రయత్నించి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ టాప్ ప్లేస్‌కి వెళ్లగా, ముంబై ఏడో స్థానానికి పడిపోయింది.