విశాఖపట్నం గ్లోబల్‌ ఐటీ హబ్‌గా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే గూగుల్‌, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు వచ్చేశాయి. తాజాగా మరో మరో ఐటీ దిగ్గజ సంస్థ సాగర తీర నగరానికి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం విశాఖపట్నంలో కార్యాలయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేసింది. ఇసుకతోట జంక్షన్‌లోని లాన్సమ్‌ స్క్వేర్‌ భవనంలో ఐబీఎం ఐబీఎం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో ప్రముఖ కో-వర్కింగ్‌ స్పేస్‌ ప్రొవైడర్‌ 'iSprout' భాగస్వామ్యంతో ఐబీఎం కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ నూతన కార్యాలయంలో 502 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఇప్పటికే ఐబీఎం 30 ఎకరాల్లో సొంత క్యాంపస్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి లోకేష్ తెలిపారు.. ఆ కంపెనీని స్వాగతిస్తున్నానంటూ.. ఆయన#ChooseSpeedChooseAP హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ఆయన విశాఖపట్నంలో లాన్సమ్‌ స్క్వేర్‌లో ఐబీఎం బోర్డును ట్యాగ్‌ చేశారు. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ముందుకు సాగుతోందని.. ఐబీఎం రాకతో విశాఖపట్నంలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతిలో క్వాంటమ్‌ హబ్‌ ఏర్పాటు ఓ గొప్ప ముందుడగన్నారు మంత్రి . ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి ఆశ్చర్యపరుస్తోందంటూ ట్వీట్ చేశారు.మరోవైపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుకు-2026కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లకు చట్టరూపం కల్పించినందుకు రాష్ట్రపతికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలపనున్నారు. మంత్రి లోకేష్ వెంట ఎంపీలు కూడా రాష్ట్రపతిని కలవనున్నారు.మరోవైపు ప్రభుత్వ స్కూల్స్‌లో అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి లోకేష్ ప్రశంసించారు.కోట్లుపోసి ప్ర‌భుత్వ బ‌డుల్లో చేర్పించాలంటూ ప‌త్రిక‌ల్లో ప్రకటనలు ఇవ్వం.. చానళ్లలో యాడ్స్ వేయించుకోం.. ప్ర‌భుత్వ బ‌డిలో సౌక‌ర్యాలు, ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాలు, ప్ర‌తిభావంతులైన ఉపాధ్యాయులు బ‌లం అన్నారు. పిల్ల‌లకు క‌ల్పించే భద్రత, సమగ్ర విద్యా వికాసం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వారి భవిష్యత్తుకు కల్పించే భరోసా గురించి మాత్రమే చెబుతామన్నారు. పిల్లలను ప్రభుత్వబడిలో చేర్పించాలంటూ వినూత్న ప్ర‌చారం చేస్తోన్న టీచ‌ర్ల‌కు అభినంద‌న‌లు తెలిపారు.