గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం.. 5KG సిలిండర్ల సప్లై పెంపు.. కొత్తగా 4 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్లు

Wait 5 sec.

LPG Supply: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో మన దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఎల్‌పీజీ కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో ఇంధన లభ్యతను నిర్వహించేందుకు మన దేశంలో 5 కిలోల చిన్న ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పైప్డ్ నేచురల్ గ్యాస్ () కనెక్షన్లను సైతం భారీగా పెంచారు. మార్చి 23 నుంచి చూసుకుంటే 13 లక్షలకు ప్రస్తుతం రోజు వారీ విక్రయాల సంఖ్య లక్ష యూనిట్లను దాటినట్లు తెలిపింది. 14.2 కిలోలు, 19 కిలోల సిలిండర్ల కొరత ఉన్న క్రమంలో ఎక్కువ మంది 5 కిలోల సిలిండర్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వలస కార్మికులు, తక్కువ ఆదాయ వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మార్చి నెల నుంచి 4,24,000 కొత్త పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్లు కేంద్రం తెలిపింది. పరివర్తనలో భాగంగా 30 వేల మందికి పైగా ఎల్‌పీజీ కనెక్షన్లను సరెండర్ చేశారని తెలిపింది. వారంతా పీఎన్‌జీకి మారిపోయినట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై ఆరు వారాలు దాటింది. దీంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన దేశం సగానికి పైగా ముడి చమురును, 40 శాతం గ్యాస్, 85- 90 శాతం ఎల్‌పీజీని ఆ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు దిగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో దేశ అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి సైతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అయితే, ఎల్‌పీజీ కోసం పశ్చిమాసియా దేశాలపైనే అధికంగా ఆధారపడడంతో సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంది. సరఫరాకు ప్రాధాన్యమిచ్చిన సంగతి తెలిసిందే. వంట గ్యాస్ ఎల్‌పీజీ కనెక్షన్లు లేని వారి కొరతను భర్తీ చేసేందుకు మార్కెట్ ధరకు లభించే 5 కిలోల సిలిండర్ల సరఫరాను పెంచారు. యుద్ధానికి ముందు ఫిబ్రవరి నెలలో సుమారు 77 వేల వరకు 5 కిలోల సిలిండర్ల అమ్మకాలు జరగగా గత 2- 3 వారాలుగా చూస్తే రోజు వారీ విక్రయాలు లక్ష మార్క్ దాటడం గమనార్హం. గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరాలు మొత్తంగా స్థిరంగా ఉన్నాయని, ఏప్రిల్ 11వ తేదీన 52 లక్షలకు పైగా సిలిండర్లను సరఫరా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.