క్యూ4 ఫలితాల వేళ 'విప్రో' కీలక నిర్ణయం.. 3 ఏళ్లలో తొలిసారి ఇలా.. ఏప్రిల్ 16న ప్రకటన!

Wait 5 sec.

: దేశీయ ఐటీ రంగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన విప్రో తమ వాటాదారులకు భారీ ప్రయోజనం అందించేందుకు సిద్ధమైంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన తుది త్రైమాసికం (జనవరి- మార్చి) సంబంధించిన ఆర్థిక ఫలితాల వేళ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను సైతం పరిశీలంచనున్నట్లు తెలిపింది. క్యూ4 ఫలితాలు, షేర్ బైబ్యాక్ అంశంపై ఏప్రిల్ 16, 2026 రోజున జరిగే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణంగా మార్కెట్ ధర కంటే అధికంగా చెల్లించి షేర్లను బైబ్యాక్ చేస్తుంటారు. వచ్చే వారంలో జరిగే ఈ కీలక భేటీలో విప్రో తన క్యూ4 ఫలితాలను ఆమోదించనుంది. అదే రోజున షేర్ల బైబ్యాక్ అంశంపైనా బోర్డు చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా కంపెనీ వద్ద అదనంగా ఉన్న నగదును ఇన్వెస్టర్లకు పంచేందుకు లేదా కంపెనీపై నమ్మకాన్ని పెంచేందుకు ఇలా షేర్ బైబ్యాక్ చేపడుతుంటారు. కంపెనీ మార్కెట్లో ఉన్న తన సొంత షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు. మార్కెట్ ధర కంటే కొంత ప్రీమియంతో షేర్ల కొనుగోలు చేపడతారు. దీంతో షేర్ హోల్డర్లకు మంచి లాభం చేకూరుతుంది. ఏప్రిల్ 16వ తేదీన జరిగే సమావేశంలో బైబ్యాక్ పరిమాణం (ఎన్ని షేర్లు), ఒక్కో షేరుకు ఇచ్చే ధర వంటి వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విప్రో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇన్వెస్టర్లలో సానుకూలతను నింపనుంది. ఈ క్రమంలో విప్రో షేరు పోకస్ లోకి రానుంది. విప్రో గతంలో కూడా పలుమార్లు భారీ ఎత్తున బైబ్యాక్ చేపట్టింది. అయితే గడిచిన 3 సంవత్సరాల కాలంలో బైబ్యాక్ చేపట్టడం ఇదే తొలిసారి కాడవం గమనార్హం. చివరి సారిగా 2023, జూన్ నెలలో షేర్ బైబ్యాక్ చేసింది. జూన్ 22-30 తేదీల మధ్య రూ.12000 కోట్లు విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. మొత్తం 26.96 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.445 చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది. విప్రో వద్ద ప్రస్తుతం రూ.41 వేల కోట్ల నెట్ క్యాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ మార్కెట్ క్యాపిటలేజేషన్‌లో 20 శాతంగా ఉంటుంది. ఇంతకు ముందు షేర్ బైబ్యాక్ చేసినప్పటి నుంచి చూసుకుంటే రూ.28 వేల కోట్లు కంపెనీ విలువ పెరిగినట్లు ఇన్వెస్టెక్ నివేదిక వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం ఈసారి రూ.16000 కోట్లు విలువైన షేర్లను బైబ్యాక్ చేయవచ్చని పేర్కొంది. అయితే. ఈ విషయంపై విప్రో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏప్రిల్ 16వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో పూర్తి క్లారిటీ రానుంది.