Ola S1 x+: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా ఉన్నటువంటి ఓలా ఎలక్ట్రిక్ మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. దీనిని ఇతర మోడళ్లకు భిన్నంగా సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో తయారు చేసిన S1 X+ 5.2 kWh వేరియంట్‌ను సోమవారం రోజు విడుదల చేసింది. ఈ ఎస్1 ఎక్స్ ప్లస్ వేరియంట్ ధరను రూ. 1,29,999 గా సంస్థ నిర్ణయించింది. దీని ధర ఇతర మోడళ్లతో పోలిస్తే చాలా తక్కువేనని తెలిపింది. ఇన్‌హౌస్‌లో రూపుదిద్దుకున్న సెల్ టెక్నాలజీ సాయంతో.. ఈ స్కూటర్ తయారు చేయడంతోనే అందుబాటు ధరలో తీసుకురావడం సాధ్యమైందని ఓలా ఎలక్ట్రిక్ తాజాగా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తక్కువ ధరకు ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటుందని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. అప్పటివరకు ప్రారంభ ధర కింద రూ. 1.29 లక్షలుగా ఉందని పేర్కొంది. దీంట్లో 11kw మిడ్ డ్రైవ్ మోటార్ అమర్చినట్లు తెలిపింది. సింగిల్ ఛార్జింగ్‌తోనే సుమారు 320 కిలోమీటర్లు (IDC రేంజ్) ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేసింది. అంటే ఈ లెక్కన ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి వెళ్లి రావొచ్చు. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంతో ఏం ఇబ్బంది లేకుండా అటు పోయి తిరిగి రావొచ్చు.ఇక ఈ కొత్త స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లుగా ఉంది. ఇక్కడ ఇతర మోడళ్ల కంటే కాస్త విభిన్నంగా ఉండేలా బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు బ్రేక్ బై వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి సదుపాయాలతో దీనిని తీసుకొచ్చినట్లు ఓలా వివరించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్లతో పాటుగా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా విక్రయిస్తోంది. S1 థర్డ్ జనరేషన్‌లో S1 ప్రో + (5.2 kWh, 4 kWh), ఎస్1 ప్రో పేరిట ప్రీమియం స్కూటర్లను అమ్ముతోంది. మాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎస్1 ఎక్స్ +, S1X విక్రయిస్తోంది. ఇక భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్‌లో భారీగా పడిపోగా.. కూడా నష్టపోయాయి. . ఇంట్రాడేలో రూ. 39.79 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 16 వేల కోట్లుగా ఉంది.