మరోసారి అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు.. పరిశీలనలో మూడు వేదికలు.. అవి ఏంటంటే?

Wait 5 sec.

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కావడం, రెండు వారాల కాల్పుల విరమణ గడువు సమీపిస్తుండటంతో ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో ఈ వారం చివరలో ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో నివేదికలు పేర్కొంటున్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ తన డిమాండ్లకు లొంగడానికి సిద్ధంగా ఉందని భావిస్తే, త్వరలోనే ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖంగా ఉన్నారు.ఏప్రిల్ 21న కాల్పుల విరమణ గడువు ముగియక ముందే యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఒక ఒప్పందానికి రావడానికి అమెరికా, ఇరాన్‌లు మరోసారి ప్రత్యక్ష చర్చల గురించి ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. మరో విడత చర్చల గురించి సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయని ముగ్గురు వ్యక్తులు తెలిపినట్టు పేర్కొంది. కాగా, టెహ్రాన్, వాషింగ్టన్ దీనికి అంగీకరించాయని మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త చెప్పారు.మొదట దఫా చర్చల్లో పాల్గొన్న ప్రతినిధి బృందం హాజరవుతుందా? లేదా? అనేది అస్పష్టంగా ఉందని ఆ దౌత్యవేత్త, అమెరికా అధికారులు తెలిపారు. నివేదిక ప్రకారం.. రెండో విడత చర్చల వేదికలుగా , ఇస్తాంబుల్, జెనీవాలు పరిశీలనలో ఉన్నాయి. వేదిక, సమయం ఇంకా నిర్ణయించలేదని, అయితే చర్చలు గురువారం జరగొచ్చని ఒక అమెరికా అధికారి తెలిపారు.దీనికి ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ‘‘అవతలి పక్షం మమ్మల్ని చర్చలకు కోరింది.. వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు’’ అని చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్‌ శాంతి చర్చల సందర్భంగా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఒక అడుగు ముందుకు వేసిందని, చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో తదుపరి అడుగు వేయాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అన్నారు. ఆయన ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు చేజారాయని మాత్రమే నేను చెప్పను. కొన్ని విషయాలు సక్రమంగానే జరిగాయని కూడా నేను భావిస్తున్నాను. మేము చాలా పురోగతి సాధించాం’’ అని అన్నారు. ‘‘వారు మా దిశగా అడుగులు వేశారు.. అందుకే మాకు కొన్ని మంచి సంకేతాలు అందాయని మేము చెప్పగలం, కానీ వారు తగినంత దూరం వెళ్లలేదు’’ అని అమెరికా ఉపాధ్యక్షుడు తెలిపారు. గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య 47 ఏళ్ల తర్వాత మొదటిసారి జరిగిన ప్రత్యక్ష చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే.