: అమెరికా- ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరిట 2026 ఫిబ్రవరి 28న ఇరాన్‌పై క్షిపణి దాడులు చేసి ఇరాన్ అగ్రనాయకులను మట్టుబెట్టాయి. బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 8న రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. కానీ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలను అంతకుముందు ఇరాన్ అడ్డుకోగా.. . దీంతో సరఫరా వ్యవస్థ స్తంభించి.. క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన ఉండగా.. ఒక దశలో అది 120 డాలర్ల స్థాయికి కూడా చేరింది. ప్రస్తుతం100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితుల్ని కల్పిస్తోంది. ఇప్పటికే క్రూడాయిల్ ధరలు పెరగడంతో.. నిల్వలు సరిపోక పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, వంటగ్యాస్ ధరలు పెరిగాయి. . బంగ్లాదేశ్, నేపాల్‌ల్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాలు ఇంధన ధరల్ని పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. చైనాలో వ్యూహాత్మక నిల్వలు అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతానికి ధరల్ని స్థిరంగానే ఉంచినట్లు తెలిసింది.ఇక మన దేశం విషయానికి వస్తే.. యుద్ధం ప్రారంభంలోనే డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1న మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. వీటికి తోడు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు.. ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుపై రూ. 2కు పైగా పెంచాయి. ఇక ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 వరకు పెరిగింది. విమాన ఇంధనం ధర కూడా సుమారు 8.5 శాతం పెరిగింది. దానికి అనుగుణంగా విమానయాన సంస్థలు రేట్లను పెంచడంతో.. విమాన ప్రయాణం మరింత ఖరీదుగా మారింది. క్రూడాయిల్ ధరల పెరుగుదల, సరఫరాలో అవాంతరాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని భావించారంతా. కానీ ప్రజలపై నేరుగా భారం మోపకుండా చూసేందుకే మోదీ సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల భారం నుంచి ఆయిల్ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు . దీని వల్ల చమురు కంపెనీలకు కాస్త నష్టాలు తగ్గాయి. చమురు ధరల భారం ప్రజలపై పడకుండా చూడటం కోసమే కేంద్రం ఇలా చేసింది.అంతే కాకుండా దేశీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించాలన్న కారణంతో.. దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. రిటైలర్స్ దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఇది నియంత్రిస్తుంది. ఆలస్యమైనా.. పెంచడం మాత్రం పక్కా?పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం భారత్‌పై ఇలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెబుతోంది. కొద్ది రోజుల కిందటి వరకు చమురు నిల్వలు సుమారు 74 రోజులకు సరిపడా ఉన్నాయని చెబుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ట్రంప్.. హార్ముజ్‌ను దిగ్బంధించడంతో కొత్త ఆందోళన మొదలైంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. అంతర్జాతీయంగా చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, అర్జెంటీనా, గయానా వంటి దేశాల్ని ఆశ్రయించినా.. అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టడంతోపాటు, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది తక్షణ పరిష్కారం కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. రష్యా నుంచి కష్టమేనా?రష్యా చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా గతంలో ఆంక్షలు విధించింది. కానీ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సరఫరా వ్యవస్థకు ఆటంకంతో అమెరికా తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. సముద్ర జలాల్లో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయడానికి.. 30 రోజుల పరిమితితో అవకాశం కల్పించగా.. ఏప్రిల్ 4తో ఈ గడువు ముగిసింది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మళ్లీ కష్టతరంగా మారింది. ఇది సరఫరాలో మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. ప్రైవేట్ రిటైలర్స్ నయారా ఎనర్జీ, షెల్ వంటివి పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా పెంచాయి. దీంతో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే భయాలు ఎక్కువయ్యాయి. దీనికి బలం చేకూరుస్తోంది. పోలింగ్ ముగిశాక ముహూర్తం!ప్రస్తుతం మనదేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్ 9న ఎలక్షన్స్ జరగ్గా.. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న.. తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోలింగ్ ముగిసే ఏప్రిల్ 29వ తేదీనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టు కూడా చేసింది.ప్రతిపక్షాల ఆరోపణలను పక్కనబెడితే.. చమురు ధరలను పెంచకుండా చూడటం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. క్రూడాయిల్ ధరలు దిగి రాకపోతే.. ఈ నెలాఖరు లేదా మే నెల తొలి వారంలో పెట్రోల్, డీజిల్ సహా ఇతర గ్యాస్ ధరల్ని పెంచాల్సి రావచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా 10 వరకు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.