ఐపీఎల్ 2026 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. చివరి బంతి వరకూ సాగుతున్న మ్యాచులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా... బీసీసీఐ తొలుత కేవలం 20 మ్యాచుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. ఆ తర్వాత పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నాటికి 21 మ్యాచులు పూర్తయ్యాయి. మే 31న జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది. అయితే తాజాగా బీసీసీఐ.. ఐపీఎల్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.ఈనెల 26, మే 21వ తేదీల్లో , మధ్య జరగాల్సిన రెండు మ్యాచుల వేదికలను పరస్పరం మార్చింది బీసీసీఐ. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న అహ్మదాబాద్, మే 21న చెన్నైలో మ్యాచ్ జరగాల్సింది. కానీ గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని కొన్ని పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికలను మార్చారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 26న చెన్నైలో, మే 21న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుంది.కాగా తన తొలి సీజన్ అయిన 2022లో టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్.. ప్రస్తుతం సీజన్‌లో మిశ్రమ ఫలితాలు అందుకుంటోంది. తొలి 4 మ్యాచులలో రెండింట్లో గెలిచింది. మరో రెండింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో ప్లేసులో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ఆరో స్థానంలో ఉంది.మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. హ్యాట్రిక్ ఓటములతో సీజన్‌ను ప్రారంభించింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్ విక్టరీ సాధించి.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ప్రస్తుతం సీఎస్కే 9వ ప్లేసులో ఉంది. గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ రెండో అర్ధభాగంలో అతడు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.