చిన్న దేశం.. పెద్ద ఆలోచన.. 'సింగపూర్' సంచలన నిర్ణయం.. సామాన్యుడి కోసం సాహసమే చేస్తుందా?

Wait 5 sec.

: . ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్నే ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ కేంద్ర బ్యాంక్ అయిన మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (MAS).. తన మానిటరీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. ఇక్కడ పాలసీని మరింత కఠినతరం చేస్తూ.. ఇదే సమయంలో వృద్ధిపై కాకుండా ద్రవ్యోల్బణం నియంత్రణపై దృష్టి సారించింది. ఇందుకోసం కరెన్సీ విలువను పెంచుకోవాలని చూస్తోంది. ఒకవైపు ఇంధన ధరలు పెరగడం.. మరోవైపు సప్లై చెయిన్‌లో అంతరాయాలు ఏర్పడటం కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎంఏఎస్ ప్రకటన ప్రకారం.. దేశ ఆర్థిక వృద్ధి 2026లో మందగించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇక 2026 ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాల్ని 1-2 శాతం నుంచి 1.5-2.5 శాతానికి పెంచింది. ఇక్కడ ప్రధానంగా సింగపూర్ కేంద్ర బ్యాంక్ తీసుకున్న నిర్ణయం.. నిత్యావసర ధరలు పెరగకుండా ఉండేందుకు ఉద్దేశించింది. తమ కరెన్సీ విలువల్ని పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే వస్తువుల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. MAS తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలోనే ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సింగపూర్ వృద్ధి రేటు కిందటి త్రైమాసికంతో పోలిస్తే 0.3 శాతం తగ్గింది. మార్కెట్ అంచనాల కంటే తక్కువగా నమోదైంది. సాధారణంగా ఏ దేశమైనా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పుడు.. వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్లోకి డబ్బును విడుదల చేస్తుంది. కానీ సింగపూర్ అందుకు భిన్నంగా 'టైటనింగ్' పాలసీని ఎంచుకుంది. ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంటుంది. కానీ సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ పద్ధతి వేరు. సింగపూర్ ఒక చిన్న ద్వీప దేశం. అక్కడ ప్రతి వస్తువు (ఆహారం నుంచి ఇంధనం వరకు) దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే వీరు వడ్డీ రేట్ల కంటే కరెన్సీ విలువపై ఎక్కువగా ఆధారపడతారు.'టైటనింగ్' అంటే?సింగపూర్ తన డాలర్ (SGD) విలువను ఇతర ప్రధాన దేశాల కరెన్సీలతో పోల్చినప్పుడు.. కొంత మేర పెంచుతుంది. దీన్నే 'టైటనింగ్' అంటారు. అంటే.. సింగపూర్ డాలర్ బలంగా ఉంటే.. ఇతర దేశాల నుంచి వస్తువుల్ని కొన్నప్పుడు తక్కువ ధరకే వస్తాయి. అంటే 'దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం' తగ్గుతుంది.ప్రస్తుతం సింగపూర్ రెండు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి ద్రవ్యోల్బణం. నిత్యావసర వస్తువులు, విద్యుత్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. రెండోది వృద్ధి మందగమనం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వల్ల సింగపూర్ ఎగుమతులు తగ్గిపోయాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదించింది.ఆర్థిక వృద్ధి తక్కువగా ఉన్నప్పుడు కరెన్సీని బలోపేతం చేయడం ఒక రకమైన సాహసమే. ఎందుకంటే కరెన్సీ విలువ పెరిగితే సింగపూర్ చేసే ఎగుమతులు ఇతర దేశాలకు ఖరీదైనవిగా మారుతాయి. తద్వారా వృద్ధి ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఎంఏఎస్.. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ధరల నియంత్రణే మొదటి ప్రాధాన్యత అని.. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ఏకైక మార్గమని వారు భావిస్తున్నారు.ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?సింగపూర్ కేంద్ర బ్యాంక్ నిర్ణయంతో.. నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారికి సింగపూర్ డాలర్ ఎక్కువ విలువను ఇస్తుంది. ఎగుమతులు చేసే కంపెనీలకు మాత్రం లాభాలు తగ్గొచ్చు. కానీ ముడి సరుకును దిగుమతి చేసుకునే పరిశ్రమలకు ఖర్చులు తగ్గుతాయి.సింపుల్‌గా చెప్పాలంటే.. సింగపూర్ ప్రభుత్వం 'ఆర్థిక వృద్ధి కంటే సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా' ఉండేందుకే ప్రస్తుతానికి పెద్దపీట వేసింది. ఇది ఒకరకమైన 'తాడు మీద నడక' లాంటిది.సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ .. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి పలుమార్లు 'టైటనింగ్' (కరెన్సీ విలువను పెంచడం) నిర్ణయాలు తీసుకుంది. గతంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు గమనిస్తే.. 2021 అక్టోబరులో కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో.. ధరలు పెరుగుతాయని ముందే ఊహించి.. ఎవరూ ఊహించని విధంగా 'టైటనింగ్' ప్రారంభించింది.దానికి ముందు 2018 ఏప్రిల్- అక్టోబర్‌లో అప్పట్లో బలమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రెండుసార్లు కరెన్సీ విలువను పెంచే నిర్ణయం తీసుకున్నారు.2008 ఆర్థిక మాంద్యం సమయంలో.. అప్పట్లో వృద్ధి పడిపోవడంతో కరెన్సీ విలువను తగ్గించి.. ఆర్థిక వ్యవస్థను ఆదుకున్నారు.గతంలో తీసుకున్న నిర్ణయాలకు.. ఇప్పటికీ ఒక ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. అప్పుడు ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నప్పుడు మాత్రమే కరెన్సీని టైటన్ చేసేవారు. ఇప్పుడు.. ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ.. పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలను అదుపు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే వృద్ధి కంటే సామాన్యుడిపై పడే ధరల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.