సీపీ సజ్జనార్‌కు డీజీగా ప్రమోషన్.. మొత్తం ఆరుగురు ఐపీఎస్‌లకు పదోన్నతులు

Wait 5 sec.

రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ‌లోని ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్‌ల‌కు డీజీ హోదా కల్పించింది. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఇక డీజీలుగా పదోన్నతి పొందిన వారిలో అదనపు డీజీలు మ‌హేష్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా, వీవీ శ్రీ‌నివాస‌రావు, చారు సిన్హా, అనిల్‌ కుమార్‌, వీసీ స‌జ్జనార్ ఉన్నారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా కొనసాగుతున్నారు. అదే సమయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఉన్నారు. ఇక తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్‌గా వీవీ శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. మహిళా భద్రతా విభాగం, సీఐడీ, ఏసీబీ ఏడీజీగా చారు సిన్హా విధుల్లో ఉన్నారు. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్ కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రమోషన్లు లభించినప్పటికీ ఇప్పటికిప్పుడు వారి స్థానాలు మారడం లేదని ప్రభుత్వం తెలిపింది. పదోన్నతులు పొందినప్పటికీ.. తర్వాతి ఉత్తర్వులు వెలువరించే వరకు ఈ ఆరుగు ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం ఉన్న బాధ్యతలనే నిర్వర్తించనున్నారు.