ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. నెల రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. భాస్కరరావు మరణంపై తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం పంజాగుట్ట వైకుంఠధామంలో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల భాస్కర్ ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నారు.1935 జూన్‌ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కరరావు జన్మించారు.. ఆయన వృత్తిరీత్యా లాయర్ కాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నాదెండ్ల భాస్కరరావు 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీని వీడి 1982లో ఎన్టీ రామారావు వెంట నడిచారు.. తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అయితే 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్టీఆర్‌ను ఎదురించిన నాదెండ్ల భాస్కరరావు.. కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నెల రోజుల తర్వాత మళ్లీ పరిణామాలు మారిపోవడంతో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.నాదెండ్ల భాస్కరరావు తిరగి కాంగ్రెస్ పార్టీలో చేరి.. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఆయన 1994 ఎన్నికల్లో మళ్లీ తెనాల నుంచి పోటీచేసినా ఓటమి పాలయ్యారు. నాదెండ్ల భాస్కరరావు వెంటనే నియోజకవర్గం మార్చేసి.. 1998 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. 2019లో భాస్కరరావు అనూహ్యంగా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.. అయితే రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేరు.నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కుమారుడు కొనసాగుతున్నారు. మనోహర్ రెండుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో మనోహర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలిలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. మనోహర్ 2018లో జనసేన పార్టీలో చేరి.. 2019 ఎన్నికల్లో మనోహర్ తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసి ఓడారు. మనోహర్ మళ్లీ 2024 ఎన్నికల్లో తెనాల నుంచి గెలిచి ఏపీ మంత్రి అయ్యారు.