ITR Filing 2026: అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ వచ్చేసింది. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులకు సంబంధించి అన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమవుతారు. ఇచ్చిన గడువులోపు ఐటీ రిటర్నులు ఫైల్ చేయకపోతే పెనాల్టీలు, ట్యాక్స్ నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. అయితే, వృద్ధులు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక మినహాయింపులు కల్పించడంతో ఈ ఏడాది తాము ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలా వద్దే అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఫైల్ చేయక్కర్లేదు. అయితే, ఈ రూల్ అందరికి వర్తించదని గుర్తుంచుకోవాలి. అందుకే 80 ఏళ్లు దాటినప్పటికీ తాము ఫైల్ చేయాలా? వద్దా? అనే విషయం తెలుసుకోవడం మంచిది. ఐటీఆర్ ఫైలింగ్ నుంచి ఎవరికి మినహాయింపు?ప్రత్యేక కేటగిరీలోని 80 ఏళ్ల వయసు దాటిన రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజ్లకు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194పీ ద్వారా పూర్తిగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల ఫైలింగ్ నుంచి మినహాయింపు లభిస్తుంది. నిర్దిష్ట షరతులను పూర్తి చేసే సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. సదరు వ్యక్తికి వచ్చే ఆదాయం కేవలం పెన్షన్, అదే బ్యాంక్ ఖాతా నుంచి వచ్చే వడ్డీ మాత్రమే ఉండాలి. వారు తమ ఆదాయ వివరాలను బ్యాంకుకు ఒక డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలి. ఆ బ్యాంకు అధికారులు ఆదాయంపై రావాల్సిన పన్నులు లెక్కించి, టీడీఎస్ రూపంలో మినహాయించుకుంటారు. అప్పుడు వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. సాధరణ పౌరులతో పోలిస్తే సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది. పాత పన్ను విధానం ఎంచుకుంటే రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఒక వేళ కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ఆదాయపు పన్ను స్లాబుల ప్రకారం వర్తించే మినహాయింపులు పొందవచ్చు. అయితే, ఈ మినహాయింపులు ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో సూపర్ సీనియర్ సిటిజన్లు సైతం తప్పనిసరిగా ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందులో పెన్షన్, వడ్డీ కాకుండా వ్యాపారం, వృత్తి లేదా ఇంటి అద్దె ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఐటీఆర్ దాఖలు చేయాలి. విదేశాల్లో ఏదైనా ఆస్తి ఉండడం లేదా విదేశీ ఖాతాలో సంతకం చేసే అధికారం ఉన్నప్పుడు రిటర్నులు ఫైల్ చేయాలి. తిరిగి పొందేందుకు తప్పనిసరిగా ఐటీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతాలో రూ.1 కోటి లేదా సేవింగ్స్ ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 80 ఏళ్ల వయసు పైబడిన వారు కేవలం పెన్షన్ మీద ఆధారపడితేనే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర పెట్టుబడులు, షేర్ మార్కెట్ లాభాలు లేదా వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేయడమే సురక్షితం.