కాల్పుల విరమణను బ్రేక్ చేసిన ఇరాన్.. హార్మూజ్‌లో నౌకపై భీకర దాడులు

Wait 5 sec.

: పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్ దళాలు హార్మూజ్ జలసంధిలో రెచ్చిపోయాయి. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది.హెచ్చరిక లేకుండానే మెరుపు దాడి..బ్రిటీష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎమ్‌టీఓ) నివేదిక ప్రకారం.. బుధవారం ఉదయం 7.55 గంటల సమయంలో ఇరాన్ గన్‌బోట్ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే వాణిజ్య నౌకపై కాల్పులు ప్రారంభించింది. ఈ దాడిలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. పర్యావరణానికి కూడా ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.చట్టబద్ధంగానే అడ్డుకున్నామన్న ఇరాన్..ఈ దాడిని ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు ఫార్స్, తస్నిమ్‌లు ధృవీకరించాయి. హార్మూజ్ జలసంధిపై తమకున్న సార్వభౌమత్వాన్ని "చట్టబద్ధంగా అమలు" చేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ ముడి చమురు, సహజ వాయువులో సుమారు 20 శాతం ఈ సన్నని మార్గం గుండానే రవాణా అవుతోంది. ఇది అంతర్జాతీయ జలమార్గం అయినప్పటికీ. తమ ప్రాదేశిక జలాల్లోని నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదని ఇరాన్ గట్టి సంకేతాలు ఇచ్చింది.ఆర్థికంగా కుప్పకూలుతున్న ఇరాన్: ట్రంప్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్‌పై విరుచుకు పడ్డారు. ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతోందని ఆయన ఎద్దేవా చేశారు. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం వల్ల ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రస్తుతం నగదు కోసం అల్లాడుతోందని, సైన్యానికి, పోలీసులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. .. హార్మూజ్ వద్ద అమెరికా సైనిక దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా తన పట్టు సడలించకపోవడం, ఇరాన్ దాడులకు తెగబడటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి.