ఉద్యోగులూ పీఎఫ్ KYC ఇంట్లోంచే చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే.. క్లెయిమ్ రిజెక్ట్ కావద్దంటే వెంటనే పూర్తి చేయండి!

Wait 5 sec.

Update PF KYC online: వేతనజీవులకు ప్రావిడెంట్ ఫండ్ అనేది కీలకం. భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాను పొందుతారు. ఉద్యోగి జీతం నుంచి కొంత, కంపెనీ నుంచి కొంత ఈ ఖాతాకు జమ అవుతుంటుంది. అయితే, ఏదైనా ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు ఈ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అయితే, పీఎఫ్ ఖాతాలోని వివరాలు, ఉద్యోగి వివరాలు సరిగ్గా ఉండాలి, ఈపీఎఫ్ ఖాతా గల ఉద్యోగులు ప్రస్తుతం తమ కేవైసీ వివరాలు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటివి ఆన్‌లైన్ ద్వారానే మార్చుకోవచ్చు. యూఏఎన్ మెంబర్ పోర్టల్ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.ఒక్క తేడా ఉన్నా మీ పీఎఫ్ క్లెయిమ్‌ను బ్లాక్ చేసే ప్రమాదం ఉంటుంది. మీరు డబ్బుల కోసం క్లెయిమ్ చేసినప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వివరాలను ఆధార్ డేటాతో క్రాస్-చెక్ చేస్తుంది. ఒక వేళ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిల్లో తేడాలు గుర్తిస్తే క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. అయితే, అలాంటివి ఏవైనా ఉంటే మీరు చాలా సులభంగానే వాటిని అప్డేట్ చేయవచ్చు. పీఎఫ్ కేవైసీని ఆన్‌లైన్ ద్వారా 5 సింపుల్ స్టెప్స్ లోనే పూర్తి చేయవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదేముందుగా మీ యూఏఎన్ పాస్‌‌వర్డ్ సాయంతే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలిమేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లి మాడిఫై బెసిక్ డీటెయిల్స్‌ ఎంచుకోవాలిమీ సరైన పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి వివరాలు ఆధార్ ప్రకారం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యూఐడీఏఐ డేటాతో సిస్టమ్ ఆటో-వెరిఫై చేస్తుంది. అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు స్టేటస్ అనేది పెండింగ్ ఫర్ ఎంప్లాయర్ అప్రూవల్ గా మారుతుంది. మీ కంపెనీ హెచ్ఆర్ లాగిన్ అయి ఆన్‌లైన్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్‌ని ఆమోదిస్తే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉండి ఆధార్ తో లింక్ అయి ఉంటే మీరు నేరుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయవచ్చు. మేనేజ్ కేవైసీ వివరాల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంప్లాయర్ సైన్-ఆఫ్ అవసరం ఉండదు. అయితే, ఇది బ్యాంక్ అకౌంట్స్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ అప్డేట్ కోసం మాత్రమే వర్తిస్తుంది. కానీ, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటివి మార్చాలంటే ఎంప్లాయర్ అప్రూవల్ తప్పనిసరి.