MI vs CSK: ముంబైతో మ్యాచ్‌కి గట్టిగా ప్లాన్ చేసిన సీఎస్కే.. ధోనీతో సహా ముగ్గురు రీ ఎంట్రీ!

Wait 5 sec.

అంటేనే ఓ వైబ్ ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లే అత్యధిక టైటిల్స్ గెలిచాయి. అందులోనూ ఇరు జట్లు సరిసమానంగా చెరి ఐదు ట్రోఫీలు అందుకున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకోసమే ఇరు జట్లు తమ తమ బెస్ట్ ప్లేయర్లను బరిలోకి దించేందుకు సిద్ధమైంది. తలా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. సీజన్ ప్రారంభానికి ముందు కండరాల గాయంతో ఐపీఎల్‌కు దూరమైన ధోనీ.. ముంబైతో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. గాయాల నుంచి కోలుకోవడమే కాకుండా, పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో ఎంఎస్ ధోనీ ముంబైతో మ్యాచ్ ఆడటం ఖాయమని తెలుస్తోంది. వాంఖడేలో ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ధోనీ గ్లోవ్స్‌తో కీపింగ్ చేస్తూ కనిపించాడు. సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ధోనీ పర్ఫెక్ట్ అని చెప్పడంతో ఫ్యాన్స్ వాంఖడేలో విజిల్స్ మోత మోగించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కీలక బ్యాటర్ ఆయుష్ మాత్రే తొడ కండరాల సమస్యతో ఈ సీజన్‌ నుంచి బయటకెళ్లాడు. దాంతో ఆయుష్ మాత్రే స్థానంలో ఉర్విల్ పటేల్ బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025లో అడుగుపెట్టిన ఉర్విల్ పటేల్ మూడు మ్యాచ్‌లో ఆడి హైయెస్ట్ 37 పరుగులతో మొత్తం 68 రన్స్ నమోదు చేశాడు. ఆయుష్ మాత్రే స్థానంలో ఏ ప్లేయర్‌ని ఇప్పటి వరకు సీఎస్కే మేనేజ్‌మెంట్ రీప్లేస్ చేయలేదు. బౌలింగ్ విభాగంలో వీక్‌గా ఉన్న సీఎస్కేలోకి ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ మ్యాచ్‌తోనే అడుగుపెట్టనున్నాడు. నాథన్ ఎలీస్ స్థానంలో రీ ప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా వచ్చిన జాన్సన్.. ఇంతకాలం జట్టుకు దూరంగానే ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ రూలుడ్ అవుట్ కావడం.. మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్లు కూడా విఫలం కావడంతో సీఎస్కే మేనేజ్‌మెంట్ స్పెన్సర్ జాన్సన్‌ని ముంబైతో మ్యాచ్‌కి బరిలోకి దింపుతోంది. వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్‌లో మొత్తం మూడు మార్పులతో సీఎస్కే కొత్తగా కనిపించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, గుర్‌జపనీత్ సింగ్.