. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న . ఉప్పల్‌లో ఎంట్రీ ఇస్తాడని అనుకున్నా.. లాస్ట్ మినిట్‌లో డగౌట్‌కే పరిమితమైన తలా ధోనీ, ముంబైలో ఆడేందుకు అన్నీ సెట్ అయ్యాయి. ఇంజ్యూరీ నుంచి కోలుకుని పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించిన ధోనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కి సిద్ధమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఇది బ్లాక్ బ్లాస్టర్ న్యూసే. ఐపీఎల్ 2026 సగం సీజన్ పూర్తయినా ఇప్పటి వరకు ధోనీని గ్రౌండ్‌లో చూడలేకపోయిన అభిమానుల కోసం.. వాంఖడేలో తలా దర్శనమివ్వనున్నాడు. హోం గ్రౌండ్ ఎవరిదైనా తలా ఎంట్రీ ఇస్తే విజిల్స్ మోత మోగిపోవాల్సిందే. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆడటం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఎంఎస్ ధోనీ ఆడటం ఖాయమనే చెబుతున్నాడు.ఐపీఎల్ కెరీర్‌లో ధోనీ 278 మ్యాచ్‌లు ఆడి 5439 పరుగులు నమోదు చేశాడు. 84 హైయెస్ట్‌తో ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు. ధోనీ తన కెరీర్‌లో 24 హాఫ్ సెంచరీలు నమోదు చేసి, 100 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 196 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో ఆఖర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ.. ఈ ఏడాది ఏ స్థానంలో ఆడతాడో చూడాలి. ఈ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కండరాల సమస్యతో ధోనీ మూడు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లు సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదంటూ ఎంట్రీ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఫ్యాన్స్ కోసం ధోనీ స్టేడియంలో కనిపించి సందడి చేశాడు. ప్రాక్టీస్ సమయంలో సీఎస్కే ఫ్యాన్స్‌ని అలరించిన ధోనీ.. సన్‌రైజర్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడు. ఇక ఈ సీజన్‌ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత కమ్ బ్యాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించింది. హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తుంది అనుకున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో కేవలం పది పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఆరంభంలో అట్టడుగు స్థానంలో ఉన్న సీఎస్కే ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.