: అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ షేర్లు బుధవారం సెషన్‌లో (ఏప్రిల్ 22) భారీ స్థాయిలో పుంజుకున్నాయి. ముందటి రోజు NSE లో రూ. 773.80 వద్ద ముగిసిన షేర్ ధర.. బుధవారం రోజు స్వల్ప లాభాలతోనే ప్రారంభమైనా తర్వాత భారీగా ఎగబాకాయి. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో ఏకంగా 20 శాతం వరకు దూసుకెళ్లి రూ. 924 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇదే స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర కూడా కావడం విశేషం. ఆఖర్లో కాస్త తగ్గింది. చివరకు 17 శాతం లాభంతో రూ. 905 వద్ద సెషన్ ముగించింది. ఒక్కరోజులోనే షేర్ ధర రూ. 131.20 పెరిగిందని చెప్పొచ్చు. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 14.16 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ ఒక్కరోజులో ఇంతలా దూసుకెళ్లేందుకు ప్రధాన కారణం.. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు.. తాజా ప్రకటనలే. లిథియం అయాన్ బ్యాటరీ వ్యూహమే ఇక్కడ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించింది. చెందిన ఈ కంపెనీ.. భారతదేశంలో లిథియం- అయాన్ సెల్స్ తయారీని పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. జయదేవ్.. ఈ కంపెనీకి ప్రస్తుతం ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2027 కల్లా పెద్ద మొత్తంలో ఈవీ సెల్ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని.. . ఇప్పుడు టెలికాం సహా డేటా సెంటర్ల విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఇంకా దాదాపు 80 దేశాలకు ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకోవడం.. కంపెనీ వృద్ధి అవకాశాల్ని మరింత మెరుగుపర్చింది. అమర రాజా వ్యూహం ఇదే..లిథియం- అయాన్ సెల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించి.. 2026లో ముందుగా మెగావాట్ స్కేల్‌లో ఉత్పత్తి చేసి కస్టమర్లకు సాంపుల్స్ ఇస్తారు. 2027 నుంచి గిగాఫ్యాక్టరీలో 2 Gwh బల్క్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2032 నాటికి 16 Gwh సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే సుమారు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలపైనే సంస్థ దృష్టి సారించగా.. ఇప్పుడు మాత్రం 50:50 నిష్పత్తిలో మొబిలిటీ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌‌ కేంద్రంగా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 50 శాతం ఈవీ అంటే ఎలక్ట్రిక్ కార్లు, బైకులు.. మరో 50 శాతం ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే సోలార్, రెనివబుల్ ఎనర్జీ నిల్వలపై దృష్టి సారిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక రంగంలో ఏమైనా డిమాండ్ తగ్గినా.. మరొకటి సపోర్టు చేస్తుందని.. దీంతో రిస్క్ కూడా తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే.. అమర రాజా కంపెనీ.. భారతదేశ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్‌లో పెద్ద స్థాయికి చేరుకోవాలని చూస్తోంది. స్వదేశీ బ్యాటరీ ఉత్పత్తిలో ఇది కీలక అడుగుగా అభివర్ణిస్తున్నారు. సంస్థ చేసిన ఈ ప్రకటనలే.. ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించినట్లు తెలుస్తోంది. గమనిక: పైన చెప్పింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అప్పుడే రిస్క్ లేకుండా కాస్త మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది.