ఐపీఎల్ 2026లో సీఎస్కే - ఆర్సీబీ తర్వాత అంత పెద్ద హైప్ ఉన్న మ్యాచ్ ఏంటంటే ముంబై - చెన్నై మ్యాచ్చే. ఐపీఎల్‌ను శాసించిన ఈ రెండు జట్లు ఇవాళ తలపడబోతున్నాయి. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పది సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. ఐదు ట్రోఫీలు గెలవగా, ఐదు టైటిల్స్ అందుకుంది. ముంబై వాంఖడే వేదికగా ఈ రెండు జట్ల మధ్య మినీ వార్ జరగడం ఖాయం. ఈ సీజన్‌లో 33వ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ సరిసమాన విజయాలతో నిలిచాయి. ముంబై ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, నాలుగు ఓడింది. చెన్నై కూడా ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి, నాలుగు ఓడింది. నెట్ రన్‌రేట్‌ కారణంగా ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఐదో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై - సీఎస్కే 39 మ్యాచ్‌లలో ఆడాయి. అందులో ముంబై అత్యధికంగా 21 మ్యాచ్‌లు సాధించగా, సీఎస్కే 18 మ్యాచ్‌లలో గెలిచింది. అయితే, ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి ఆరు మ్యాచ్‌లలో సీఎస్కేదే పైచేయి. చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లలో గెలిస్తే, ముంబై ఇండియన్స్ కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. గతేడాది రెండు ఆడితే ఒకదాంట్లో ముంబై, మరో దాంట్లో చెన్నై విజయం సాధించాయి. ముంబై ఇండియన్స్ జట్టు అంచనాక్వింటన్ డికాక్, దానిష్ మలేవర్, నమన్ ధీర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూధర్‌ఫోర్డ్, క్రిష్ భరత్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డివాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, గుర్‌జపనీత్ సింగ్.