Gold Bond Scheme Returns: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. అందుకే బంగారం చాలా కాలంగా ఇన్వెస్టర్లకు స్థిరంగా రిటర్న్స్ ఇస్తూ వస్తుంది. బంగారంపై పెట్టుబడులకు చాలానే మార్గాలు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన . ఈ స్కీమ్ కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా.. ఐదేళ్లు ముగిసిన తర్వాత ముందస్తుగానే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతున్న క్రమంలో.. కొంత కాలంగా కొత్త బాండ్లను ఇష్యూ చేయట్లేదు. ఈ క్రమంలో గతంలో ఇష్యూ చేసిన బాండ్లపై మాత్రం డబ్బుల్ని చెల్లిస్తుంది. ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ 2018-19 సిరీస్- II కు సంబంధించి తాజాగా ఆర్బీఐ ముందస్తు విమోచన ధరల్ని (ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) ప్రకటించింది. 2018, అక్టోబర్ 23న గోల్డ్ బాండ్లను ఇష్యూ చేయగా.. ఈ ఏప్రిల్ 23 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఇష్యూ ధర, రిడెంప్షన్ ధరల్ని.. ఆయా తేదీలకు ముందు 3 రోజుల సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్ గ్రాము లేదా యూనిట్‌కు రూ. 3,146 గా నిర్ణయించగా.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి.. డిజిటల్‌ రూపంలో పేమెంట్ చేసే వారికి గ్రాముపై రూ. 50 చొప్పున డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు గోల్డ్ బాండ్ యూనిట్ ధర రూ. 3096 అయింది. ఇక ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర చూస్తే గ్రాముకు ఇప్పుడు రూ. 15,219 గా నిర్ణయించింది. ఏప్రిల్ 20, 21, 22 తేదీల్లో సగటు ఐబీజేఏ (ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్) ధరల ఆధారంగా ఆర్బీఐ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ అబ్జల్యూట్ రిటర్న్స్ పరంగా చూస్తే గ్రాముపైనే రూ. 15,219- 3096= రూ. 12,123 చొప్పున లాభం వచ్చింది. ఇది శాతం పరంగా చూస్తే 392 శాతానికిపైగానే రాబడి వచ్చింది. అంటే లక్ష పెట్టుబడిని రూ. 4.92 లక్షలు చేసింది. అయితే ఇక్కడ వాస్తవ రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ బాండ్లపై ఆర్బీఐ వార్షిక ప్రాతిపదికన 2.50 శాతం వడ్డీ అందిస్తుంది. ఇక్కడ లక్షపై ప్రతి ఏడాది రూ. 2500 వడ్డీ వస్తుంది. ఇలా ఏడేళ్లలో వడ్డీతోనే రూ. 17500 వడ్డీ వచ్చింది. అంటే మొత్తంగా లక్ష పెట్టుబడిపై రూ. 5.10 లక్షల వరకు రాబడి వచ్చిందన్నమాట.