65 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆశల సాకారానికి మరో కీలక అడుగు.. 'నేరడి' ప్రాజెక్టుకు కొత్తగా డీపీఆర్

Wait 5 sec.

శ్రీకాకుళంజిల్లా వాసుల ఎన్నో ఏళ్ల నిజం కాబోతోంది.. దాదాపు 65 ఏళ్ల తర్వాత కీలక ముందగుడు పడింది. ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న నిర్మాణం కోసం కొత్త డీపీఆర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇటీవల వీడబ్ల్యూడీటీ (వంశధార నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌) తీర్పుపై కేంద్రం గెజిట్ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.. దీంతో బ్యారేజీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఏపీ ప్రభుత్వం బ్యారేజ్‌ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో కొత్త డీపీఆర్ తయారీ, సర్వే సహా ఇతర పనుల కోసం రూ.70 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నేరడి బ్యారేజి ఆలస్యంకావడంతో నీళ్ల మళ్లింపు కోసం సైడ్‌ వియర్‌ నిర్మించారు.. కానీ ఆ ప్రయత్నం విజయవంతంకాలేదు. హిరమండలంలో ఎత్తిపోతలను ప్లాన్ చేసి.. మొత్తం 19.5 డీఎంసీల నీళ్లు మళ్లించాలని భావించారు.. కానీ ఆ నిర్మాణం కూడా పూర్తికాని పరిస్థితి ఉంది. ఇప్పుడు నేరడి బ్యారేజి పనులు చేపట్టి పూర్తిచేస్తే తొలిదశలో లక్షా 48వేల ఎకరాలకు నీళ్లు అందించొచ్చని చెబుతున్నారు. రెండో రెండో దశలో మరో లక్షా 7వేల 280 ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు. సాగునీరుతో పాటుగా తాగునీటి సమస్య కూడా తీరుతుందని.. వంశధార-నాగావళి అనుసంధానం పలితాలు దక్కుతాయంటున్నారు. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం1961లో తొలి అడుగు పడింది.. అప్పటి నుంచి కోర్టు చిక్కులతో ఈ ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేరడి బ్యారేజీ అంశం గురించి కేంద్రంతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర జలశక్తిమంత్రి, ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇటీవల నేరడి బ్యారేజ్‌కు సంబంధించి.. వీడబ్ల్యూడీటీ (వంశధార నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్‌) తుది తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ వచ్చేసింది. మరోవైపు ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకునేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరినవాటిని పరిష్కరించేందుక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలోనే ఒడిశా ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉందంటున్నారు.