తో మ్యాచ్‌కి చాలా పకడ్బందీగా సిద్ధమవుతోంది. . ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ టీ20 వరల్డ్‌కప్ స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను బరిలోకి దింపుతోంది. ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్‌ హెడ్ టు హెడ్ రిజల్ట్స్‌లో ముంబైదే పైచేయి. ఇరు జట్ల మధ్య 39 మ్యాచ్‌లు జరిగితే ముంబై అత్యధికంగా 21 మ్యాచ్‌లు గెలవగా, చెన్నై 18 మ్యాచ్‌లలో విజయం సాధించింది. చెన్నైపై ఇప్పటి వరకు అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టు కూడా ముంబై ఇండియన్సే. కానీ గత ఆరు మ్యాచ్‌ల నుంచి చూస్తే సీన్ రివర్స్‌గా కనిపిస్తుంది. చివరి ఆరు మ్యాచ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ విజయాలు సాధించింది. ముంబై కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. చెన్నై ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ ముంబైతో మ్యాచ్‌లో మాత్రం ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. చివరి ఆరు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్.. అది కూడా గతేడాదే. 2025లో రెండు మ్యాచ్‌లలో చెన్నై ఒకటి, ముంబై ఒకటి గెలవగా.. మిగతా నాలుగు మ్యాచ్‌లలోనూ సీఎస్కేనే వరుస విజయాలు సాధించింది. సీఎస్కే ట్రాక్ రికార్డు ఆధారంగా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో మంచి జట్టుతో బరిలోకి దిగాలని ఫిక్స్ అయింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్‌పై గ్రాండ్ విక్టరీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. అయినా, సీఎస్కేపై విజయం సాధించాలంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని జట్టులో స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను దింపుతోంది. ఇంగ్లండ్‌కు చెందిన టీ20 వరల్డ్‌కప్ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. టోర్నీలో 226 పరుగులతో పాటు తొమ్మిది వికెట్లు కూడా తీసుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన జాక్స్ టీ20 వరల్డ్‌కప్‌లో నాలుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకోవడం విశేషం. అదే జోష్‌తో ముంబై విజయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 2024 సంవత్సరంలో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన విల్ జాక్స్.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తీసుకుంది. గతేడాది 13 మ్యాచ్‌లు ఆడిన విల్ జాక్స్ 53 హైయెస్ట్‌తో 233 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆరు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ సీజన్ మధ్యలో అడుగుపెట్టబోతున్న విల్ జాక్స్, ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.