బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్.. చమురు కొరతకు కారణం అదే: మార్కెట్ వర్గాలు

Wait 5 sec.

రాష్ట్రంలో లేదని తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల పెట్రోల్, డీజిల్ సరఫరా ఆలస్యం చేయడం వల్లే పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఆయిల్ కంపెనీలు చమురును ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయని తెలిపారు. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికి ఈ చమురు కొరతకు సంబంధించిన కారణాలపై క్లారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు చమురు సరఫరా తగ్గటం వల్లే రాష్ట్రంలో చాలా చోట్ల నో స్టాక్ దర్శనం ఇస్తున్నాయని అమరేందర్ రెడ్డి తెలిపారు. కొన్ని పెట్రోల్ బంకుల ఓనర్లు.. ఆయిల్ కంపెనీల నుంచి తీసుకున్న క్రెడిట్‌కు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవటం వల్ల కూడా పెట్రోల్, డీజిల్ లేదని బోర్డులు పెడుతున్నట్లు వివరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని అమరేందర్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. యుద్ధం కారణంగా ఆయిల్ కంపెనీలపై రోజువారీగా వేల కోట్ల రూపాయల భారం పడుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఈనెల 29వ తేదీన చివరి విడత ఎన్నికలు జరగనుండగా.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు కొంత వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక భారత్‌లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అమరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ అవసరాలకు కావాల్సినంత నిల్వలు ఉన్నాయని పెట్రోల్, డీజిల్ కొరత రాదని తేల్చి చెప్పారు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరాను పెంచితే ప్రస్తుత కొరత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో చమురు కొరత, పెట్రోల్ డీజిల్ దొరకదు అంటూ వస్తున్న వార్తల కారణంగా చాలా మంది తమకు అవసరమైన దాని కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. చాలా మంది వాహనాల్లో మాత్రమే కాకుండా.. క్యాన్లు, డ్రమ్ములు, బకెట్లలో పెట్రోల్, డీజిల్ నింపుకుని వెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి పనులు చేయొద్దని జనాలకు అమరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్లే నిజమైన చమురు కొరతకు కారణం అవుతోందని వివరించారు. ఆయిల్ కంపెనీలు చమురు సరఫరా విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు తీయొద్దని హితవు పలికారు.