బంధువులకు రెంట్ చెల్లిస్తున్నారా? ఇకపై ఐటీ శాఖ డేగ కన్ను.. కొత్త HRA నిబంధనలివే..!

Wait 5 sec.

HRA Claim: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బిగ్ అలర్ట్. చాలా మంది ట్యాక్స్ పేయర్లు పన్ను ఆదా కోసం (హెచ్ఆర్ఏ) క్లెయిమ్ చేస్తారు. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి నిబంధనలు కఠినతరం అయ్యాయి. ఇంటి అద్దె భత్యం మినహాయింపు పొందుతున్న ఉద్యోగులు ఇక నుంచి కఠినమైన నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. . ఫారం 12బీబీ స్థానంలో అదనపు వివరాలతో కూడిన కొత్త డిక్లరేషన్ ఫారాన్ని తీసుకొచ్చింది. అదే . అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.పన్ను మినహాయింపు ప్రయోజనాల కోసం ఉద్యోగులు ఈ ఫారాన్ని తమ కంపెనీ హెచ్ఆర్‌కి సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఉద్యోగి తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటూ చేస్తున్నట్లయితే ఇక నుంచి ఆ ఇంటి యజమానితో తనకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో అద్దె వివరాలు, ఏడాదికి ఒక రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే యజమాని పాన్ నంబర్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అదనపు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి యజమాని మీకు బంధువా కాదా? అనే విషయాన్ని తెలియజేయాలి. అలాగే ఒక వేళ బంధువు అయితే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువులు వంటి సంబంధం ఏంటో స్పష్టంగా పేర్కొనాలి.చూపే బోగస్ హెచ్ఆర్ఏ క్లెయిమ్‌ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. బంధుత్వ వివరాలను వెల్లడించడం ద్వారా ఐటీ శాఖ డేటాను క్రాస్ వెరిఫై చేసి అద్దె ఆదాయాన్ని సదరు బంధువులు తమ ఐటీ రిటర్నుల్లో చూపించారో లేదో సులభంగా గుర్తించేందుకు వీలవుతుంది. బంధువులకు అద్దె కట్టినా హెచ్ఆర్ఏ మినహాయింపు వస్తుంది. అయితే అందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అద్దెను తప్పనిసరిగా బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారానే చెల్లించాలి. రెంటల్ అగ్రిమెంట్, అద్దె రసీదులు ఉండాలి. ఇంటి యజమాని ఆ అద్దెను తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించాలి.ముంబై వంటి మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపులు, నాన్- మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంటుంది. హెచ్ఆర్ఏ మినహాయింపును 3 అంశాలలో ఏది తక్కువైతే దాని ఆధారంగా లెక్కిస్తారు. కంపెనీ నుంచి పొందిన అసలు హెచ్ఆర్ఏ, జీతంలో 50 శాతం లేదా చెల్లించిన అద్దెలో నుంచి జీంతోల 10 శాతాన్ని తీసేసిన తర్వాత వచ్చే మొత్తం. ఇకపై ఉద్యోగులు టీడీఎస్ మినహాయింపు కోసం ఫారం 12బీబీకి బదులుగా ఫారం 124 ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంటి యజమానితో ఉన్న సంబంధాన్ని తెలియపరచాలి. బోగస్ హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ నిరోధించేందుకు ఐటీ శాఖ నిఘా ఉంటుందని గమనించాలి.