Aadhaar Card: మీ ఆధార్ కార్డులోని తేదీని బట్టి నా వయసు ఇంత అని ధీమాగా ఉన్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఆధార్ కార్డు కేవలం మీరు ఫలానా వ్యక్తి అని తెలిపే ఒక గుర్తింపు కార్డు మాత్రమే. మీ పుట్టిన తేదీని ధ్రువీకరించే అధికారిక డాక్యుమెంట్ కాదు. ఈ విషయంపై మరోసారి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ () క్లారిటీ ఇచ్చింది. చాలా కాలంగా స్కూల్ . పుట్టిన తేదీని ఆధార్ ద్వారా ధ్రువీకరించలేమని స్పష్టం చేసింది. అలాగే ఆధార్‌ని ఎందుకు ఉపయోగిస్తేమో స్పష్టమైన వివరణ ఇచ్చింది.ఆధార్ కార్డుపై ఫోటో, అడ్రస్ సహా డేట్ ఆఫ్ బర్త్ సైతం ఉంటుంది కదా అది ప్రూఫ్ ఎలా కాకుండా పోతుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇక్కడే అసలు మెలిక దాగి ఉంది. ఆధార్ చట్టం-2016 ప్రకారం ఆధార్ అనేది ఒక వ్యక్తి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా అందించే ఐడెంటిటీ డాక్యుమెంట్ మాత్రమే.'ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీ విషయంలో ఎప్పుడైనా వివాదం తలెత్తినప్పుడు, ఆ తేదీ సరైన పుట్టిన తేదీ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్డుదారుదే' అని UIDAI డైరెక్టర్ సంజీవ్ యాదవ్ స్పష్టం చేశారు.పుట్టిన తేదీకి ఎందుకు అధికారిక ధ్రువీకరణ కాదు అనేందుకు ప్రధాన కారణం ఆధార్ నమోదు ప్రక్రియలోనే దాగి ఉంది. ఆధార్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తుంటారు. సరైన ఆధారాలు లేని పక్షంలో సిస్టమ్ ఆటోమేటిక్ గా జనవరి 1 తేదీని డిఫాల్ట్‌గా పుట్టిన తేదీగా తీసుకుంటుంది. ఇలాంటి అంచనా ఆధారంగా రూపొందిన కార్డును బర్త్ ప్రూఫ్‌గా ఎలా పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో 'ఆధార్ అనేది సబ్సిడీలు, ప్రభుత్వ సేవలు నేరుగా లబ్ధిదారుడికి అందుతున్నాయా లేదా అని చూపే ధ్రువీకరణ సాధనం మాత్రమేనని, దీన్ని బర్త్ రిజిస్ట్రీగా చూడటం చట్టపరంగా తప్పు' అని UIDAI అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సైతం పేర్కొన్నారు. అందుకే పాస్‌పోర్ట్ కోసం లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఆధార్ కార్డుతో పాటు టెన్త్ క్లాస్ మెమో లేదా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్‌ను తీసుకెళ్లడం మంచిది. లేదంటే కీలక సమయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.క్యూఆర్ కోడ్‌లో మార్పులు(Disclaimer) ఉంటోంది. అందులో 'ఆధార్ అనేది గుర్తింపునకు ఆధారం మాత్రమే, పుట్టిన తేదీకి కాదు' అని ముద్రిస్తున్నారు. పాత కార్డులు ఉన్నవారు ఇది అఫీషియల్ ప్రూఫ్ అనుకుని పొరపడే అవకాశం ఉంటుంది. అయితే సిస్టమ్‌లో మాత్రం దాన్ని ప్రూఫ్ కింద తీసుకోరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఆధారు కార్డుదారు గుర్తుంచుకోవాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా బర్త్ సర్టిఫికెట్ వేరుగా తీసుకోవాలి.